ఏపీలో జరుగుతున్న రాజకీయాలను ఎవ్వరు ఎప్పుడు ఊహించలేరు. ఊహాలకి అందని ఎన్నో రాజకీయ మలుపులు ఏపీలో జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతిరోజు ఎదో ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వస్తుంది. మొదట మార్చిలో నిర్వహించాలని ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు కానీ కరోనా కారణంగా ఆపేశారు. అయితే తమను సంప్రదించకుండా ఎన్నికలను ఎన్నికల కమిషినర్ ఎలా వాయిదా వేస్తారని వైసీపీ ప్రభుత్వం ఆయనను స్పెషల్ ఆర్డినెన్స్ మీద తొలగించి, వేరే వ్యక్తిని నియమించారు.
రమేష్ కు ఎందుకు జగన్ భయపడుతున్నారు??
మార్చి కరోనా కారణంగా ఆపడాన్ని తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మార్చిలో చాలా స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం స్థానిక ఎన్నికలంటే మాత్రం భయపడుతుంది. ఎందుకంటే నిమ్మగడ్డ ఎక్కడ టీడీపీకి అనుకాలంగా నిర్ణయాలు తీసుకుంటారోనని. రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు ఎప్పటి నుండి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆరోపణల ఆధారంగానే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ వైసీపీని ఓడించగలదా!!
2019 ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన షాక్ నుండి టీడీపీ నేతలు ఇంకా కొలుకోలేదు. వైసీపీ విజయం టీడీపీ పార్టీని నేలమట్టం చేసింది. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలీలగా ఓడించారు. ఇంతటి విజయాన్ని సాధించిన వైసీపీ నాయకులు ఇప్పుడు స్థానిక ఎన్నికలంటే ఎందుకో భయపడుతున్నారు. కరోనాను కట్టడి చెయ్యడంలో విఫలమయ్యామని భయమే లేక అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కూడా ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదనే భయంతోనో తెలియదు కానీ స్థానిక ఎన్నికలంటే మాత్రం వైసీపీ నాయకులు చాలా భయపడుతున్నారు. కరోనా వల్ల వైసీపీకి చెడ్డపేరు వచ్చిందనువుకుంటే ఈ కరోనా కాలంలో టీడీపీ నాయకులు కూడా చేసింది ఏమి లేదు. వాళ్లకు కూడా కరోనా వల్ల కలిసి వచ్చేది ఏమి లేదు. ప్రజల్లో ఒకవేళ వైసీపీపై అప్పుడే నమ్మకం పోయినా కూడా టీడీపీ మాత్రం వైసీపీని ఓడించలేదు.