తెలంగాణలో భూసమస్యలకు ఇక చెక్ పడింది. సీఎం కేసీఆర్ తాజాగా ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. నిజానికి ఈ పోర్టల్ దసరా సందర్భంగా ఆరోజే ప్రారంభం కావాల్సిన ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా గురువారం నాడు.. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించారు.
ధరణి పోర్టల్ ప్రారంభానికి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి అనే గ్రామం వేడుకైంది. మూడుచింతలపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. ఈ గ్రామం ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఉంది.
అయితే.. ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ ఆ ఊరు నుంచి ప్రారంభించడానికి ఒక కారణం ఉంది. మూడుచింతలపల్లికి ప్రత్యేక గౌరవం దక్కడానికి కారణం.. వీరారెడ్డి అనే వ్యక్తి.
అవును.. అదే గ్రామానికి చెందిన వీరారెడ్డి 1969 లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన పోరాటం చేశారు. వీరారెడ్డి.. తెలంగాణ కోసం పోరాడి.. జైలుపాలయ్యారు. ఆయన పుట్టిన గడ్డ కాబట్టి.. మూడుచింతలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్.. ధరణి పోర్టల్ ను ప్రారంభించి ఆయనకు గొప్ప గౌరవాన్ని అందించారు.