2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత ఇతర పార్టీల నాయకులు వైసీపీలోకి వెళ్ళడానికి చాలా ఉత్సహం చూపిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది నేతలు ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకివ్ వస్తున్నారు. అలా వచ్చిన వాళ్లలో వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. ఆయన ఎన్నికలు ముగిసిన కొన్నిరోజులకే వైసీపీ మద్దతుదారుడిగా మారిపోయి చంద్రబాబు నాయుడును ఆడుకుంటున్నారు. అయితే వంశీ ఎన్ని మాటలు అన్నా కూడా టీడీపీ నేతలు మాత్రం ఏమి అనడం లేదు.
ఉప ఎన్నికల కోసం డిమాండ్ చెయ్యొచ్చు కదా!!
తెలుగుదేశం పార్టీకి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకుంటుంది. నిజానికి తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టమే. అయితే అదే సమయంలో ఆ పార్టీ డిమాండ్ చేయాల్సిన గన్నవరం నియోజకవర్గాన్ని మాత్రం వదిలేసింది. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున విజయం సాధించిన వల్లభనేని వంశీ వైసీపీికి మద్దతుదారుగా మారిపోయారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని తొలినాళ్లలో డిమాండ్ చేసిన తెలుగుదేశం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు.గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ టీడీపీ జెండాయే ఎగురుతోంది. అలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీమీద సవాల్ విసరాల్సిన తెలుగుదేశం పార్టీ నేతలు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది.
వైసీపీ గన్నవరంలో గెలవలేదా!!
వైసీపీకి ఇప్పుడు గన్నవరంలో ఇతర పార్టీల నుండి కంటే కూడా సొంత పార్టీలోనే ఎక్కువ పోటీ ఉంది. అక్కడ ఉన్న వైసీపీ నేతల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గన్నవరంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు గ్రూపులుగా విడిపోయి నిత్యం ఘర్షణలకు దిగుతున్నారు. ఈ ఘర్షణలు ఉప ఎన్నికలు జరిగితే టీడీపీకి అనుకూలంగా మారనున్నాయి. కానీ టీడీపీ నేతలు ఇక్కడ ఉప ఎన్నిక కోసం డిమాండ్ చెయ్యడం లేదు.