బీజేపీ పార్టీ ప్రస్తుతం దూకుడుమీదుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా పార్టీ.. తెలంగాణలో పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందుకే… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త దూకుడు మీదున్నారు. తెలంగాణలో స్పీడ్ పెంచారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేయని పనిలేదు.
పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న బండి సంజయ్ కి ఉన్న ఒకే ఒక సమస్య.. క్యాడర్. అవును.. తను పార్టీ బలోపేతం కోసం ఎంత కష్టపడుతున్నా.. తనకు కావాల్సినంత మద్దతు.. మిగితా బీజేపీ నేతల నుంచి అందడం లేదట. దీంతో ఆయన బీజేపీ నేతల మీద సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో పాతుకుపోయిన టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఒక్కరి వల్ల అయ్యే విషయం కాదు.. దానికి పార్టీ క్యాడర్ మొత్తం సమాయత్తమవ్వాలి. కానీ.. మిగితా నాయకులెవ్వరూ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి తనకు మద్దతేమీ ఇవ్వడం లేదని బాధపడిపోతున్నారట.
ఓవైపు రాష్ట్ర అధ్యక్షుడు… పార్టీని ఒంటిచేత్తో మోయాల్సి రావడం.. మరోవైపు ఆయనకు మద్దతు లేకపోవడంపై.. ఏం చేయాలో తెలియక బండి సంజయ్ తలపట్టుకుంటున్నారట.
చాలాసార్లు పార్టీ నేతల మద్దతు కోసం చూసినా.. ఆయనకు మద్దతు లభించకపోవడంతో ఇక ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు. ఆయన తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు కొందరు నేతలకు రుచించడం లేదు. దీంతో ఈ విషయం హైకమాండ్ దాకా వెళ్లిందట. దీంతో.. పార్టీలో ఉన్న చిక్కులను పరిష్కరించేందుకు… కిషన్ రెడ్డి రంగంలోకి దిగాల్సి వస్తోందట.