KTR: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. అయితే ఈ ఎన్నికలలో భాగంగా తిరిగి ఆప్ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా ఈ ఎన్నికలలో బిజెపి విజయం సాధించబోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి బిజెపి ముందంజలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అక్కడ ఆప్ ఓటమిని తీసుకోవాల్సి వచ్చింది అయితే ఈ ఎన్నికల ఫలితాలలో ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ఒక్క చోట కూడా కాతా తెరవలేదు.
ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక చోటు కూడా ముందంజలో లేనిపక్షంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీకి సెటైరికల్ పోస్ట్ చేశారు. ఢిల్లీలో బిజెపిని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు అంటూ ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో ఒక్కచోట కూడా ఖాతా తెరవకపోవడంతోనే ఈయన విమర్శలు కురిపించారని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో దాదాపుగా అఖండ విజయాలతో ఆధిపత్యం చెలాయించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ వెనకడుగు వేసింది.
ఇలా రెండుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ ఎన్నికలలో ఓటమిపాలు కావటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏది ఏమైనా ఢిల్లీలో అధికార పీఠం అందుకోవాలని గత 30 సంవత్సరాల పాటు ఎదురుచూస్తున్న బిజెపి కళ నేటితో సహకారమైందని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ గత మూడు దఫాలుగా ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోతూ వస్తుంది.