Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా పలు కారణాల వల్ల చిత్రీకరణ కొన్ని రోజుల పాటు వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటన చేశారు. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సర్కారీ వారి పాట సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడం కోసం దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటం కోసం బాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోసగాళ్లు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ పై పోకస్ పెట్టిన సునీల్ శెట్టి వరుణ్ తేజ్ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారు.త్వరలోనే మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రంలో పాల్గొననున్నారు ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు కాలేజీ సినిమాల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
