2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధించిన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎప్పటికి మర్చిపోదు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల అమలుకు మాత్రం చాల అడ్డంకులు వస్తున్నాయి. చాల పథకాలు ఆచరణకు నోచుకోవడం లేదు. దీనికి గల కారణం ఏంటంటే ప్రతిపక్షం రూపంలో టీడీపీ అన్నింటికీ అడ్డుపడుతుందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అప్పుడే రెండు సంవత్సరాలకు పూర్తీ కావొస్తుంది. కాని ఈ కరోనా వల్ల ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. దీన్ని అదునుగా తీసుకున్న టీడీపీ నాయకులు జగన్ అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారు. జగన్ ను అడ్డుకుంటూ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రయత్నంలోనే భాగంగా 30 లక్షల ఇళ్ల పథకాల పంపిణిని కూడా టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని వైసీపీ నాయకులూ భావిస్తున్నారు. ఈ పథకం అమలులోకి వస్తే దాదాపు కోటిన్నర మంది లబ్ది పొందుతారని, దీని వలన ప్రజల్లో జగన్ కు ఉన్న అభిమానం మరింత పెరిగే అవకాశం ఉందనే భావనతో అడ్డుకుంటుందని వైసీపీ పెద్దలు చెప్తున్నారు. ఈ పథకం అమలుకు మొదట ఉగాది మార్చ్ 25న ప్రణాళిక రచించారు. అప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఆ తరువాత అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 న ప్లాన్ చేశారు. అప్పుడు కరోనా వాళ్ళ ఆగిపోయింది. మళ్ళీ జూలై 8 వైఎస్అర్ జయంతిన ప్లాన్ అప్పటికి కేసులు దాఖలు కావడంతో ఆ పథకం అమలు ఆగిపోయింది. జగన్ చేయాలనుకున్న ప్రతి పనికి టీడీపీ ఎదో ఒక రూపంలో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. రాజకీయ చాణిక్యుడైన చంద్రబాబు వ్యూహాలను ఎదుర్కోవాలంటే జగన్ కు ఇంకా అనుభవం రావాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.