కరోనా సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ను ఊపేసిన అంశం ఏదన్నా ఉందంటే అది స్థానిక ఎన్నికలు. ఈ విషయం చుట్టూ జరిగిన రాజకీయాలను, ఎత్తులు పైఎత్తులను ఏపీ ప్రజలు అప్పుడే మర్చిపోరు. అయితే ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు రాష్ట్రంలో ఒక యుద్దంలా జరుగుతున్నాయి. టీడీపీ,వైసీపీ మధ్యన పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తుంది. మాములుగా జరిగే ఈ స్థానిక ఎన్నికలను మ్యానిఫెస్టో విడుదల చేసి, పెద్ద రాజకీయంగా చేసింది మాత్రం చంద్రబాబు నాయుడే. ఈ మ్యానిఫెస్టో వల్ల పంచాయతీ ఎన్నికల స్థాయి మారింది.
టీడీపీకి ముందస్తు వ్యూహం
ఇక ఏపీలో చూస్తే క్షేత్ర స్థాయిలో టీడీపీకి బలం ఉంది. టీడీపీకి ఓట్లు పడని పోలింగు బూత్ లేదు, టీడీపీ గుర్తు తెలియని పల్లె జనం లేరు. నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీ అది. ఇక టీడీపీ కింద నుంచి పైకి రావాలనుకుంటోంది. రాష్ట్రంలో పోగొట్టుకున్న అధికారాన్ని చేజిక్కుంచుకోవాలంటే పల్లెలను ముందు తన వైపునకు తిప్పుకోవాలని చూస్తోంది. దాంతో పాటే ముందస్తుగా కసరత్తు చేసింది. అభ్యర్ధులను రెడీ చేసి పెట్టుకుంది. వ్యూహాలను కూడా రూపొందించుకుంది. దాంతో పల్లె పోరులో టీడీపీ తరఫున గట్టిగానే హుషార్ ఉందని చెప్పాలి.
వైసీపీకి అసలు అభ్యర్థులు లేరా!!
పంచాయతీ ఎన్నికలో అభ్యర్థులను నిలబెట్టడానికి అధికార పార్టీకి అభ్యర్థులు లేకపోవడం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వైసీపీలో ఉన్న వర్గ పోరు వల్లే ఇదంతా జరుగుతుంది. మొన్నటి వరకు వైసీపీ నాయకులు ఈ పంచాయతీ ఎన్నికలను లైట్ గా తీసుకున్నారు కానీ ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితం రెండు సంవత్సరాల వైసీపీ పాలనకు నిదర్శనం కానుంది. అందుకే ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటూ, వ్యూహాలు రచిస్తున్నారు.