నిఖిల్ ని తొక్కేయాలని చూసిన ఆ హీరోలు ఎవరు?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం .ఓ మాయాలోకం. ఇక్కడ ఎవరికీ ఎవరూ శాశ్వతంగా మిత్రులు, శత్రువులు ఉండరు. ఒకరి పైన ఒకరు ఆధిపత్యం సాధించడం కోసం ఏవేవో కుట్రలు, కుతంత్రాలు జరుపుతూనే ఉంటారు. ఏ బాక్గ్రౌండ్ లేని వాళ్ళని తోక్కేసిన సందర్భాలు అనేకం. ఇప్పుడు అలాగే ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండ వచ్చి, డీసెంట్ హిట్స్ తో కెరీర్ ని నిలబెట్టుకున్న హీరో నిఖిల్ ని తొక్కేయాలని ఇద్దరు హీరోలు చూసారని టాక్ వినిపిస్తుంది.

చాలా గ్యాప్ తర్వాత నిఖిల్ ‘కార్తికేయ 2 ‘ సినిమా తో ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కు నిఖిల్ చాలా ఇబ్బంది పడ్డాడు. తన సినిమా రిలీజ్ కాకుండా చూస్తున్నారని నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిఖిల్ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

ఏ మాత్రం హైప్ లేకుండా రిలీజ్ అయిన నిఖిల్ సినిమా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది. అయితే కార్తికేయ 2 సినిమాని ఆపడానికి ప్రయత్నించింది ఎవరా..? అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రశ్న ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే దీనిపై కొందరు ఒకోలా స్పందిస్తున్నారు. దాని ప్రకారం నాగార్జున, నితిన్ ఇద్దరూ నిఖిల్ సినిమా తొక్కేయడానికి ప్రయత్నించారు అంటూ నిఖిల్ అభిమానులు మండిపడుతున్నారు.

నాగార్జున కొడుకు నాగచైతన్య నటించిన ‘థాంక్యూ’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ నిఖిల్ సినిమాతో పాటు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.