కాంగ్రెస్‌ను ముప్పతిప్పలు పెడుతున్న మాజీ హీరోయిన్.. త్వరలో పార్టీ వీడనుందా.. ??

 

కొంచెం కష్టమైనా ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో లెక్క పెట్టవచ్చట.. కానీ ఈ రాజకీయం చేసే వారి మనసులో ఏముందో కనిపెట్టడం కష్టమంటున్నారు కొందరు.. ఇక పార్టీలోకి సేవ పేరుతో వస్తారు.. ఆ తర్వాత పదవి దక్కలేదని, తగినంత గుర్తింపు రాలేదని బాధపడిపోతారు.. ఇలాంటి వారు దాదాపుగా రాజకీయాల్లో చాలా మందే ఉన్నారట.. ఇకపోతే ఏంతో ఆర్భాటంగా రాజకీయ రంగప్రవేశం చేసిన విజయశాంతి తన రాజకీయ జీవితంలో ఇంకా తొలిదశలోనే ఉన్నారట.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ మాజీ హీరోయిన్ ఎన్నికలప్పుడే కనిపిస్తారన్న ప్రచారం ఉంది..

ఇకపోతే ప్రస్తుతం మెదక్ జిల్లా దుబ్బాక నియోజవర్గంలో ఉప ఎన్నికల పోరు చాలా ఉత్కంఠంగా సాగుతుంది.. ఇక మొదట కాంగ్రెస్ తరపున విజయశాంతిని ఇక్కడ బరిలో దించుతామని అనుకున్నప్పటికి కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్ నుంచి చెరకు శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే గతంలో విజయశాంతి మెదక్ జిల్లా పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. కాబట్టి తన జిల్లా పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రచారానికి వస్తారని అంతా భావించారు కానీ విజయశాంతి అసలు కాంగ్రెస్‌ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కనీసం పార్టీ ప్రచారానికి కూడా ఆమె ముందుకు రాకపోవడంతో పార్టీ పట్ల విజయశాంతికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుంది.

ఇక లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానమే కల్పించింది. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచార కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలను కూడా ఇచ్చారు. కానీ శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన తర్వాత ఈమె పత్తా లేకుండా పోయారు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా విజయశాంతి స్థానిక నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వానపాములా ఉన్న కాంగ్రెస్ ను నమ్ముకుంటే తాను ఎదగలేదని భావించిన విజయశాంతి పార్టీకి పూర్తిగా దూరమయినట్లే అనే ప్రచారం కూడా జరుగుతుంది.. అంటే ఈ లెక్కన కాంగ్రెస్‌ను వీడి మరే పార్టీలో తన కాలుమోపుతుందో ఈ రాములమ్మ ఇక తానే చెప్పాలి..