2019 ఎన్నికల సమయంలో జగన్ సునామీని చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా నియోజక వర్గాల్లో క్యాడెంట్లను మార్పులు చేసి బరిలోకి దించిన సంగతి తెలిసిందే. అలా కొవ్వూరు నియోజక వర్గంలో పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే అనిత పోటి చేసింది. అంతకు ముందు 2014 లో ఆ నియోజక వర్గం నుంచి కృష్ణా జిల్లా తిరువూరు కు చెందిన జవహార్ బరిలోకి దిగి గెలిచారు. టీచర్ వృత్తిలో ఉండే ఆయన టీడీపీలో చేరారు. ఆ తర్వాత భారీ మెజార్టీతో జవహార్ అక్కడ నుంచి గెలిచి కొవ్వూరుని ని అభివృద్ధి పథంలో నడిపించారు. అక్కడ మాదిగ సామాజిక వర్గం నేతల్ని ఆకర్షించడంలో జవహార్ నూరు శాతం సక్సెస్ అయ్యారు.
ఆయన ట్యాలెంట్ చూసిన చంద్రబాబు మంత్రిని కూడా చేసారు. కానీ కొత్తొడు వస్తే కమ్మ సామాజిక వర్గం కన్నెరజేస్తుంది గా. సరిగ్గా అదే జరిగింది. ఎన్నో ఎళ్లగా పార్టీలో ఉన్న వాళ్ల కి పదవులు లేవు..కొత్తగా వచ్చిన టీచర్ మంత్రి అయిపోయాడు అన్న కక్ష ఆ నియోజక వర్గం కమ్మ సామాజిక వర్గంలో ప్రభల్లింది. ఆ ఎఫెక్ట్ తో పాటు, జవహార్ స్వయంకృతం కారణంగా కొన్ని తప్పిదాలు జరిగాయి. ఆ తర్వాత 2019 ఎన్నికలో సమయంలో జవహార్ ని తిరువూరుకి పంపించి అనితను కొవ్వూరు నుంచి బరిలోకి దించడం జరిగింది. ఆ ఎన్నికల ఫలితాల గురించి చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం కొవ్వురు టీడీపీ ఇన్ ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. అటు తిరువూరులో ఉండటం జవహార్ కి ఇబ్బందిగాను ఉందిట. అందుకే ఇప్పుడు కొవ్వూరు బాధ్యతలు జవహార్ కి అప్పగిస్తారా? అన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం టీడీపీ జిల్లా ఇన్ ఛార్జ్ లను నియమిస్తోంది. ఈ నేపథ్యంలో కొవ్వూరు కథేంటో కూడా రెండు, మూడు రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు.