YS Jagan : వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: వైఎస్ జగన్ స్పందించాల్సిందేనా.?

YS Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా పెద్దయెత్తున ‘నెగెటివ్’ ప్రచారం చేస్తున్న వైనం కనిపిస్తోంది.. వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీకి సంబంధించి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంపేశారనీ, చంపించేశారనీ.. టీడీపీ నేతలు కొందరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికైతే ఆకాశమే హద్దు.

సీబీఐ విచారణ మొదలయ్యాక చాలాకాలంపాటు సరైన సమాచారం మీడియాకి అందలేదు.. రాజకీయ పార్టీలకీ అందలేదు. కానీ, గత కొద్ది రోజులుగా సీబీఐ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. అవి సీబీఐ నుంచి వస్తున్నాయా.? లేదంటే చార్జిషీటు దాఖలయ్యింది గనుక.. వాంగ్మూలాల పేరిట ఇంకే రూపంలో అయినా లీకులు వస్తున్నాయా.? అన్నది తేలాల్సి వుంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వున్నారు. ముఖ్యమంత్రి పదవిలో వుండీ, ఈ తరహా లీకుల్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు.? అన్నది కీలకమైన ప్రశ్న. తన మీద దుష్ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి భావిస్తే, దాన్ని ఖండించాల్సిన రీతిలో ఖండించాలి కదా.? కానీ, వైఎస్ జగన్ అస్సలు స్పందించట్లేదు.

సజ్జల రామకృష్ణారెడ్డి కావొచ్చు, ఇంకో వైసీపీ ముఖ్య నేత కావొచ్చు.. వీళ్ళెవరు స్పందించినా, ఆ స్పందనలకు విలువ వుండదు. అక్కడ ఆరోపణలు చేస్తున్నది వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె తరఫున. సో, ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీలైనంత త్వరగా స్పందించాలి. లేనిపక్షంలో వైసీపీకి అది చాలా పెద్ద మైనస్ అవుతుంది.

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చాలా అనుమానాలు దుష్ప్రచారాలు.. కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సునీతా రెడ్డి విషయంలోనూ దుష్ప్రచారమంటే.. జగన్ ఒకింత ఈ వ్యవహారాల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందేనేమో.!