ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ ఎప్పుడు రానుందంటే?

‘బాహుబలి’ తర్వాత ‘సాహో’, ‘రాధే శ్యామ్’ లాంటి వరుస డిజాస్టర్స్ తర్వాత వస్తున్నా ‘ఆదిపురుష్’ మీదే ప్రభాస్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ – రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో హిందీలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా కాలమే అయ్యింది, కానీ ఈ సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. సినిమా ప్రారంభంలోనే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు, కానీ ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. ప్రభాస్ ఫాన్స్ ఆ టీం తీవ్రంగా ట్రోల్ కూడా చేసారు.

ఇప్పుడు ప్రభాస్ అభిమానులను ఫుల్ ఖుషీ చేసేందుకు ‘ఆదిపురుష్’ టీం ప్లాన్ చేస్తోంది. ప్రభాస్ ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ లో చెయ్యడానికి టీం చూస్తున్నట్టు తెలుస్తుంది. సీత పాత్రలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్. ఈ సినిమా 2023 జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.