Whats App: వాట్సాప్ గ్రూపు ల్లో అభ్యంతకర పోస్టులపై గ్రూప్ అడ్మిన్ బాధ్యత వహించడం పై కేరళ హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. అటువంటి పోస్టులకు అడ్మిషన్ బాధ్యులు కాదు అంటూ హైకోర్టు తెలిపింది. మార్చి 2020 లో జరిగిన ఒక సంఘటన కు సంబంధించిన కేసు విచారణ జరగదగా ఆ కేసులో పిటిషనర్ ఫ్రెండ్స్ అనే వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశాడు. అందులో అతడితో పాటు మరో ఇద్దరు అడ్మిన్లు ఉండగా వారిలో ఒకరు వాట్సాప్ గ్రూప్ లో చైల్డ్ పోర్న్ కు సంబంధించిన కంటెంట్ ను పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని 67 బి, పోక్సో చట్టంలోని సెక్షన్ 13,14,15 ఆధారంగా గ్రూప్ అడ్మిన్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఇందులో పిటిషనర్ గ్రూపును క్రియేట్ చేసినప్పటి నుంచి ఈ కేసులో ఏ2గా ఉన్నాడు. ఈ పోస్టు విషయంలో తనకు ప‍్రమేయం లేదంటూ అతను కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు గ్రూప్‌లోని మెంబర్ పోస్ట్ చేసిన అభ్యంతకర పోస్టులకు గ్రూపు అడ్మిన్ బాధ్యులుకారని పేర్కొంది. అలా వారిని బాధ్యులుగా పరిగణించడం క్రిమినల్ చట‍్టంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ కోర్టు తీర్పునిచ్చింది.