ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు.. ఆగ్రహంతో యువతి తల్లిదండ్రులు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే యువతీ యువకులు ప్రేమ, వ్యామోహం అని తల్లితండ్రులను ఎదిరించి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం తమ పరువు కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తమ కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ తల్లిదండ్రులు యువకుడి ఇంటిని దగ్ధం చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే… యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధ మల్ల గ్రామనికి చెందిన వేముల భాను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఎబౌతి యువకులు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంటి నుండి పారిపోయి శుక్రవారం ఇద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ వాట్సప్ గ్రూప్ లో భాను షేర్ చేశాడు.

దీంతో కూతురి ప్రేమ పెళ్లి విషయం గురించి తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు తీవ్ర అగ్రహానికి గురయ్యారు. తమ కూతురిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నందుకు భాను మీద కోపంతో ఊగిపోతున్న యువతి తల్లిదండ్రులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో భాను ఇంటికి నిప్పు అంటించి దగ్ధం చేశారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇటువంటి ప్రాణా నష్టం జరగలేదు. కాకపోతే ఇల్లు కాలిపోయినందుకు దాదాపు 6 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు భాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.