గాసిప్స్ : “అవతార్ 2” తో “పుష్ప 2″నా అసలు జరిగే పనేనా.?

ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్లో భారీ అంచనాలు ఉన్నటువంటి లేటెస్ట్ చిత్రాల్లో “అవతార్ 2” ఒకటి. ఇక ఈ సినిమాపై ఎన్ని అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో ఈ చిత్రం రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ ఉన్న చిత్రం “పుష్ప 2” తో లింక్ పెట్టి కొన్ని గాసిప్స్ వైరల్ గా మారాయి. మరి ఈ రెండు సినిమాలకి లింక్ ఎలా అయ్యిందో మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే ఈ డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో రిలీజ్ చేస్తుండగా.

దీనితో అయితే ఏకంగా పుష్ప టీజర్ ని అటాచ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది అసలు అయ్యే పనేనా అని కొందరు అనుకుంటున్నారు. మరి ఇంకొందరు అయితే ఈ ఇండియన్ వెర్షన్ వరకు సాధ్యమైనన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్లాన్ చేస్తున్నారట.

దీనితో ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కానీ ఈ సినిమాపై అప్పుడే టీజర్ వరకు వెళ్లిపోవడం కాస్త అతి గానే ఉంది. మరి నిజంగానే ఈ రెండు సినిమాలు లింక్ అయ్యి ఉంటాయా లేదా అనేది చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా ఇప్పుడు మరింత మంది స్టార్ లు నటించనున్నారు.