YSRCP Lost 2024 elections : 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది.. అలాగని, ఆ పార్టీ అడ్రస్ గల్లంతయ్యిందా.? మరి, 2024 ఎన్నికల్లో గనుక వైసీపీ ఓడిపోతే, వైసీపీ ఎందుకు రాజకీయ తెరపైనుంచి మాయమవుతుంది.?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని చెబుతుంటారుగానీ, ఒక్కోసారి రాజకీయాల పట్ల కనీసపాటి అవగాహన లేకుండా వ్యవహరిస్తారు. లేకపోతే, ఒక్క ఎన్నికలో ఓడిపోయినంతమాత్రాన వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందనడమేంటి.?
ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడటంలో చంద్రబాబుద దిట్ట. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు వైసీపీని నాశనం చేయడానికి చాలా వ్యవహారాలు నడిపారు. పార్టీ ఫిరాయింలపులను ప్రోత్సహించడం, తద్వారా వైసీపీని నిర్వీర్యం చేయడం.. అనే ఓ పెద్ద ఆపరేషన్ నిర్వహించారు చంద్రబాబు గతంలో.
కానీ, ఏమయ్యింది.? ఎంతమంది ఎమ్మెల్యేలు అప్పట్లో వైసీపీ నుంచి టీడీపీలోకి దూరారో, ఆ సంఖ్య మాత్రమే 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చింది. చేసిన పాపానికి ఖర్మ అనుభవించాల్సి రావడమంటే ఇదే మరి.
మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైసీపీ గల్లంతవుతుందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడితే పరిస్థితి ఏంటి.? ఇంకేముంటుంది, తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఆ తర్వాత ఎక్కడా కనిపించదు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణలో పూర్తిగా టీడీపీ మాయమైపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తెరగాలి ఇప్పటికైనా.