డాక్టర్ సుధాకర్ విషయంలో తప్పు ప్రభుత్వానిదా? ప‌్రతిపక్షానిదా? అతనిదా? అన్నది పక్కనబెడితే ఏపీ పోలీసుల చేసిన ఓవర్ యాక్షన్ కి ప్రభుత్వం నిందలు మోయాల్సి వస్తున్న మాట మాత్రం వాస్తవం. దొంగ దొంగ అని అరిచి వెంటపడేవాడు కన్నా..ఆ అరిచేవాడి అసలు రూపం ఏంటన్నది ఎవరూ తొందరగా అంచనా వేయలేరు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పరిస్థితి అదే. తప్పు పోలీసులు చేస్తే ప్రతిపక్షాలు దాన్ని యంగ్ సీఎం జగన్ మోహన్ రెడ్ కి అంటించి నానా యాగి చేస్తున్నాయి. ఇందులో ప్రతిపక్షం పాత్ర ఉందా? లేదా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సీబీఐ త్వరలో ఆ విషయాలు అన్నింటిని బయటపెట్టనుంది.
అయితే అప్పటివరకూ ప్రభుత్వం ఆ అపవాదును మోయాల్సిందే. ఇప్పటికే హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతోన్న ప్రభుత్వానికి తాజాగా సుధాకర్ వ్యవహారంతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు అయింది. తాజాగా సుధాకర్ వ్యవహారం ఏకంగా రాష్ర్టం దేశం దాటి ఖండాలకు పాకేసింది. సుధాకర్ పై ఓ బ్రిటన్ పత్రిక కవర్ చేయడం ఆసక్తికరం. భారత్ లో మాస్కుల కొరతను ప్రశ్నించిన వైద్యుడ్ని మెంటల్ ఆసుపత్రికి పంపించారాంటూ యూకే కు చెందిన మెట్రో పత్రిక హైలైట్ చేసింది. డాక్టర్ ఇన్ ఇండియన్ పీపీఈరో..బండిల్ ఆఫ్ టూ మెంటల్ యూనిట్ అని హెడ్డింగ్ ఇచ్చి కథనాన్ని వేసింది.
సుధాకర్ తో పోలీసులు వ్యవరించిన తీరు, అంతకు ముందు జరిగిన విషయాల్ని కథనంలో పేర్కొన్నారు. ఇందులో సుధాకర్ చొక్కా లేకుండా ఉన్న ఫోటోని వేసారు. ఇందులో ఆయన చేతుల్ని పోలీసులు వెనక్కి లాగి తాడుతో కడుతున్న ఫోటోని వాడారు. సుధాకర్ మొత్తం ఎపిసోడ్ ని జోయల్ టేలర్ అనే పాత్రికేయుడు స్టడీ చేసి ప్రచురించాడు. దీంతో తాజా పరిస్థితి ప్రభుత్వానికి మరింత ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసినా…పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా మొత్తం ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తోంది. మరి వీటన్నింటి నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుందో చూడాలి.