Akira Nandan: పవన్ కొడుకు అకీరాను పరిచయం చేయబోతున్న వై జయంతి మూవీస్… దర్శకుడు అతనేనా?

Akira Nandan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం రాజకీయాలలో బిజీ అవుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన కమిట్ అయిన సినిమాలను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. తనకు వీలైనప్పుడల్లా ఆ సినిమా పనులను పూర్తి చేసే పనులలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం ఈయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడమే అందుకు కారణమని చెప్పాలి.

ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కొనసాగుతున్న నేపథ్యంలో ఇకపై సినిమాలు చేయరని ఈయన పూర్తిస్థాయిలో రాజకీయాలలో కొనసాగుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వారసుడిగా ఆయన కుమారుడు ఆఖీరా ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా తన కుమారుడిని వెంటపెట్టుకొని వెళ్తున్నారు. ఇక అకీరా కూడా పూర్తిస్థాయిలో హీరో కటౌట్ తో ఉన్నారు. ఈ క్రమంలోనే అకిరా సినీ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను వైజయంతి మూవీస్ బ్యానర్ వారు తీసుకున్నారని తెలుస్తుంది. ఈ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఆఖీరా మొదటి సినిమాలో నటిస్తూ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా ఈయనని ఇండస్ట్రీకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పరిచయం చేయబోయే బాధ్యతలను కూడా తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈయన కాకపోతే పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ ఆ బాధ్యతలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరిలో ఎవరో ఒకరి డైరెక్షన్లోనే ఆఖీరా ఇండస్ట్రీకి లాంచ్ కాబోతున్నట్టు సమాచారం.

ఇలా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అకీరా ఎంట్రీ ఉండబోతుందన్న విషయం అభిమానులలో భారీ అంచనాలను పెంచేస్తుంది. ఇకపోతే ఇదివరకు మరో మెగా వారసుడు అయిన రామ్ చరణ్ ను కూడా వైజయంతి మూవీస్ వారు ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే అకిరా సినీ ఎంట్రీకి మరి కొంత సమయం పడుతుందని తెలుస్తుంది.