కూతురి విషయంలో ఆ ముద్ర తట్టుకోలేకే కేసీఆర్ ఇలా చేశాడా..?

cm kcr

 నిన్న జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎవరు ఊహించని స్థాయిలో పోలింగ్ జరిగింది. మొత్తం 824 ఓట్లు ఉంటే వందకు వంద శాతం పోలింగ్ జరగటం విశేషం. 823 ఓట్లు పోల్ అయ్యాయి. ఆ ఒక్క ఓటు అభ్యర్థి చనిపోవటంతో కుదరలేదు. ఈ స్థాయిలో భారీ పోలింగ్ జరగటం వెనుక తెరాస అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలుస్తుంది. కేసీఆర్ కూతరు కల్వకుంట్ల కవిత మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవటం, తెరాస పార్టీ ముఖ్యంగా కేసీఆర్ తట్టుకోలేకపోయారు. తన కూతురి పేరు ముందు ‘మాజీ’ అనే ముద్ర ఆయన్ని బాగా ఇబ్బందికి గురిచేసినట్లు తెలుస్తుంది.

kcr kavitha telugu rajyam

 

  నిజామాబాద్ ఉప పోరులో ఆమెను గెలిపించి తీరాలని కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. పోల్ మేనేజ్మెంట్ లో కేసీఆర్ కు తిరుగులేదని చెపుతారు. అలాంటి కేసీఆర్ నిజామాబాద్ ఎన్నికల్లో చక్రం తిప్పినట్లు తెలిసింది. దీనితో ఎన్నికలు దాదాపు ఏకపక్షముగా జరిగాయని చెపుతున్నారు.. ఈ ఎన్నికల్లో చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు 700 పైచిలుకు ఓట్లు కవితకు నమోదైనట్లు తెలుస్తుంది.

  నిజానికి తెరాస పార్టీకి 524 ఓట్లు వున్నాయి, ఎంఐఎం కు 28, స్వతంత్ర అభ్యర్థులకు 66 ఓట్లు వున్నాయి అవన్నీ కలిపితే 620 దాక వస్తాయి. కానీ కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు చెందిన కొందరు కవిత కు అనుకూలంగా ఓట్లు వేయటంతోనే దాదాపు 700 దాక వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ తెరాస మా ఓట్లు కొనుకోలు చేసి, ఈ ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పటం జరిగింది. ముందు నుండి ఇక్కడ విజయం కవితకు దక్కుతుందని అందరు అనుకున్నారు, అందుకే మిగిలిన పార్టీలు దుబ్బాక ఉప ఎన్నికల మీద దృష్టి పెట్టి, ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. విజయం తధ్యమని తెలిసిన కానీ తెరాస పార్టీ ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా భారీ మెజారిటీ సాధించి గతంలో కవిత కోల్పోయిన స్థాయిని తిరిగి తీసుకోవాలని రావాలని గట్టిగా కృషి చేసారు..