గీతం గోల ఏంటి..? కూల్చివేతకు అదేనా కారణం

gitam University

 ప్రభుత్వానికి సంబంధించిన భూములను ఆక్రమించారని గీతం యూనివర్సిటి కి చెందిన పలు కట్టడాలను జీవీఎంసీ అధికారాలు ఈ రోజు ఉదయం పడగొట్టడం ప్రారంభించారు. బీచ్ రోడ్ మీదగా గీతం వెళ్లే రహదారిని రెండు వైపులా మూసివేసి యూనివర్సిటి చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించి ఆ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అయితే ఉన్నపళంగా గీతం యొక్క భవనాలను కూల్చివేయటమేంటి అనే అనుమానం అందరికి కలుగుతుంది.

gitam University

 నిజానికి ఈ వివాదం ఇప్పటిది కాదు . గీతం విద్యాసంస్ధ ఏర్పాటుకు 71.15 ఎకరాల భూమిని కేటాయించాలంటూ 1981లో యాజమాన్యం ప్రభుత్వాన్నికోరింది.తమకు భూమి ఎక్కడ కావాలో – ఏ సర్వేలో ఉన్న భూమి కావాలో కూడా యాజమాన్యమే ప్రభుత్వానికి సూచించింది. మొత్తానికి ప్రభుత్వం యాజమాన్యానికి భూమిని ఇవ్వటానికి అంగీకరించింది. అయితే యాజమాన్యానికి ఎటువంటి హక్కులు ఇవ్వకుండానే స్ధలంలో ఎటువంటి శాశ్వత భవనాలు నిర్మించేందుకు లేదనే కండీషన్ పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొత్తం భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామనే కండీషన్ చాలా కీలకం.

 భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత యాజమాన్యం 14 ఎకరాల్లో శాశ్వత భవనాలను నిర్మించిన యాజమాన్యం మిగిలిన భూమిని 15 ఏళ్ళపాటు ఖాళీగానే ఉంచింది. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదు రావటంతో నిర్మాణాలున్న స్ధలాన్ని ఖాళీగా ఉన్న స్ధలాన్ని పరిశీలించిన రెవిన్యు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న స్ధలంలో 8ఎకరాలను మాత్రం ఉంచుకుని మిగిలిన 49 ఎకరాలను వెంటనే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలంటూ నోటీసులు ఇచ్చింది యాజమాన్యానికి.

Gitam University Vizag

   ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఆ భూమిని యాజమాన్యానికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఎకర రూ. 18 వేలుగా ధర నిర్ణయించింది. పనిలో పనిగా 1981 నుండి ఏడాదికి ప్రభుత్వం నిర్ణయించిన ధరపై 10 శాతం వడ్డీ కట్టాలని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించేసిన యాజమాన్యం భూమిని స్వాధీనం చేసేసుకుంది. ఆ తర్వాత చుట్టూ పక్కల వున్నా భూములను కూడా ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి.

 ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై అరా తీసి కబ్జా చేసిన దానికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 8.4 కోట్లు చెల్లించి సొంతం చేసుకోవాలని నోటీసులు ఇచ్చింది. దీనికి గీతం నుండి ఎలాంటి సమాధానం రాకపోవటంతో తాజాగా కూల్చివేతలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. దీనిపై మరో వాదన కూడా వినిపిస్తుంది. చివరిలో తీసుకున్న40 ఎకరాలకు కూడా డబ్బులు చెల్లించి, తిరిగి సొంతం చేసుకోవాలని గీతం కు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు, దానికి గీతం వాళ్ళు ఒప్పుకోకపోవటం వలనే ఈ కూల్చివేతలు చేసినట్లు కూడా మాటలు వినిపిస్తున్నాయి.

అన్నట్లు ఈ గీతం యూనివర్సిటి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కుటుంబానికి చెందింది కావటంతో టీడీపీ శ్రేణులు దీనిని వ్యతిరేకిస్తూ, కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై గీతం యాజమాన్యం స్పందిస్తూ తమకు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పటం కొసమెరుపు