టీడీపీ నేతల పండగ మహానాడు నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పార్టీకి చెందిన కీలక నేతలంతా ఓ దగ్గర సమావేశమై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికార పక్షాన్ని విమర్శించడమే ఎజెండాగా మహానాడు ప్రారంభమైంది. బుధవారం, గురువారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక పార్టీకి చెందిన మిగతా వారంతా ఆన్ లైన్ జూమ్ లో జూమ్ చేసుకుని చూసుకోవాల్సిందే. ఓ పార్టీ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడం టీడీపీకి ఇదే తొలిసారి. ఆరకంగా టీడీపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అనొచ్చు. ఎందుకంటే ఇలా ఒకేసారి దాదాపు 25 వేల మందితో ఆన్ లైన్ జూమింగ్ అన్నది రికార్డు అనే అనాలి.
అయితే ఇక్కడ మహానాడులో చంద్రబాబు మాయ చేస్తున్నాడే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆఫ్ లైన్ లో కార్యక్రమం నిర్వహిస్తుంటే జనసమీకరణకు ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఆన్ లైన్ లో జరిగే ఈ కార్యక్రమానికి జనాలు లిమిట్ ఉంటుంది అనడమే హాస్యాస్పదంగా ఉంది. జూమ్ యాప్ అంటే ప్రత్యేక అనుమతులు ద్వారా 14 వేల మంది మాత్రమే చూసేలా ఓ లిమిట్ పెట్టుకున్నారనుకుందాం. మరి యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా 10 వేల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసాం అన్నదాన్ని ఏమనాలో అర్ధం కావడం లేదు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా యూ ట్యూబ్ లో కోట్లలో, లక్షల్లో వ్యూస్ వస్తున్న రోజులివి.
అలాంటింది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు 25వేల మందికి మాత్రమే పరిమితం చేయడం ఏంటి? అన్న ఓ సందేహం అందరిలోనూ కలుగుతోంది. టీడీపీ గత వీడియోలు చూస్తే పార్టీ నేతల స్పీచ్ లను అనుసరించే వాళ్లు కోట్లలో ఉన్నారు. అలాంటింది చంద్రబాబు మహానాడులో మాట్లాడుతుంటే అంత మంది చూడరా? సరిగ్గా 25 వేల మందే చూసేలా చంద్రబాబు ఏదైనా సెట్ అప్ బాక్స్ సెట్ చేసారా? అంటూ సోషల్ మీడియా జనాలు జోకులేస్తున్నారు. లేక దీని వెనుక ఎవరికి తెలియని మాయ ఏదైనా జరుగుతుందా? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరి ఆ గుట్టు బాబుగారు విప్పిదే గాని తెలియదు.