తెలుగు రాష్ర్టాల్లో ఇప్పుడు కృష్ణా వాటర్ వార్ హాట్ టాపిక్. కృష్ణా నీళ్లపై తెలంగాణ ఎడ్డెం అంటే..ఏపీ తెడ్డం అంటోంది. మానీళ్లు మేము తీసుకుంటున్నామని ఏపీ అంటుంటే… అలా ఎలా కుదురుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ లో కృష్ణా నీటిని ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డి పాడుకు తరలించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ముందుకెళ్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. అవసరమైతే సుప్రీం కోర్టుకెళ్లి పోరాడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అల్టిమేటం జారీ చేసారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలు వార్ లో మునిగిపోయాయి.
అటు తెలంగాణ లో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ అండ్ కో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పణంగా పెడతారా? అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కొందడారం సైతం సీన్ లోకి ఎంటరయ్యారు. అయితే ఏపీలో ప్రతి పక్షం మాత్రం ఇప్పటివరకూ సైలెంట్ గానే ఉంది. చంద్రబాబు అండ్ కో ఇప్పటివరకూ ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి..చంద్రబాబు మౌన వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేసారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన ఓపీనియన్ ని గుంటూరు మీడియా సమావేశంలో చెప్పారు.
శ్రీశైలంలో మిగులు జలాలను పొతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తీసుకునే అవకాశం ఉందన్నారు. అయితే నేరుగా వైకాపా ప్రభుత్వానికి మద్దస్తున్నట్లుగా కాకుండా ద్వంద వైఖరిని ప్రదర్శించారు. మీరు ఏం చేస్తారో? మాకు తెలియదు రాయలసీమకు నీళ్లు తెప్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని కామెంట్ చేసారు. తెలంగాణ ప్రభుత్వంతో పోరాటమే చేస్తారో? దోస్తానమే కడతారో? మీ ఇష్టం. రాయలసీమకు మాత్రం నీళ్లు ఇవాల్సిందేనని డిమాండ్ చేసారు. వెనుకబడిన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని గతంలోనే బీజీపీ పోరాటం చేసిందని కన్నా గుర్తు చేసారు.