Tamil Panindia Flops : తమిళ పానిండియా ఫ్లాప్స్ కి కారణమేమిటి?

Tamil Panindia Flops :  ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలు వాటి పాన్-ఇండియా విడుదలలతో బాక్సాఫీసు హిట్స్ గా మారడం చూస్తున్నాం. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సోషల్ మీడియాలోనే కాకుండా ఆఫ్‌లైన్ ప్రపంచంలో కూడా వైరల్ కల్చరల్ ట్రెండ్స్ ని సృష్టించింది. తమిళంలో సూర్య నటించిన ఓటీటీ రిలీజ్ ‘జై భీమ్’ సైతం ఆస్కార్ నామిషేన్ లో ఓటమి పాలైనా, ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.

గత నెల అజిత్ నటించిన ‘వలిమై’ కేవలం తమిళ సినీ అభిమానులతో మాత్రమే కాకుండా, ఎన్నారై ప్రపంచంలో కూడా విపరీత సందడి చేసింది. సింగపూర్ తో బాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో 4వ వారంలో కూడా స్ట్రాంగ్ గా వుంది.

ఐతే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఇది తమిళ ప్రేక్షక లోకానికే మాత్రమే పరిమితమైంది.

పాన్-ఇండియా సౌత్ రిలీజ్‌ల ట్రెండ్ మొదట 2015లో తెలుగు చిత్రాలతోనే మొదలైంది. ప్రభాస్ ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015) ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేయగా,

‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (2017), ‘సాహో’ (2019), యష్ నటించిన ‘KGF: చాప్టర్ 1’ (2018) బాహుబలి ట్రేడ్ నే ముందుకు నడిపించాయి. ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ (2021) సౌత్ సినిమాలని దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది.

ఉత్తరాది థియేట్రికల్ మార్కెట్‌లలో తడాఖా చూపింది. పాన్-ఇండియా మార్కెట్లలో తమిళ చిత్రాల పనితీరు ఇందుకు భిన్నంగా వుంది. ‘బాహుబలి’ చారిత్రాత్మక విజయం సృష్టించిన వెంటనే, రజనీకాంత్ తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘2.0’ (2018) పాన్-ఇండియా లెవెల్లో 2018 లో విడుదలైంది.

ఇదొక్కటి మాత్రం పాన్ ఇండియా మార్కెట్లో ప్రభావం చూపిన తమిళ సినిమాగా నిలబడింది.

ఈ రెండు మాత్రం జీరో

దీనితర్వాత ఈ సంవత్సరం పాన్ ఇండియా తమిళ చిత్రాలుగా విడుదలైన అజిత్  వలిమై‘ , సూర్య నటించిన ఈటీ రెండిట్లో ఏదీ తమిళ రాష్ట్రం వెలుపల గతంలో విడుదలైన తెలుగు పాన్ ఇండియా విడుదలల కంటే పెద్దగా ముద్ర వేయలేదనేది గమనార్హం.  

అజిత్ వలిమై కి బావుందని, బాగా లేదని మిశ్రమ సమీక్షలు వచ్చినా, మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అయితేఅత్యధిక కలెక్షన్ తమిళనాడు నుంచే  వచ్చింది.

దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి  10 నుంచి  12 శాతం కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు నిర్ధారిస్తున్నారు.

అలాగేసూర్య ఈటీ  ఐదు రోజుల్లో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిందిఅయితే అందులో తమిళనాడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి  8 శాతం మాత్రమే వచ్చింది. విజయ్ నటించిన మాస్టర్‘ 2021లో విడుదలైంది.

అయితే లాక్ డౌన్ కాలంలో థియేటర్లపై 50 శాతం పరిమితులు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ రికార్డుల్ని  బద్దలు కొట్టగలిగింది.

 మాస్టర్‘ మొదటి రోజు రూ.34 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టగాతొలిరోజు రూ.37 కోట్లు రాబట్టి వలిమై  అన్ని రికార్డుల్ని  బద్దలు కొట్టింది. ఇలా తమిళనాడులో తప్ప ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విఫల మయ్యాయి.

తెలుగు పాన్ ఇండియా పవర్

ఒక పక్క తమిళ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ లలో విఫలమవుతూంటే, తెలుగు పాన్-ఇండియా విడుదలలు మాత్రం భారీ విజయాలని సాధిస్తున్నాయి. 

పుష్ప ఘన విజయం తర్వాత రాధేశ్యామ్ పాన్ ఇండియా పరాజయాన్ని పక్కన బెడితే, తిరిగి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో తెలుగు  పాన్ ఇండియా పవర్ మరోసారి రుజువైంది.

మరి తమిళ పానిండియాలు విఫల మవడానికి కారణ మేమిటి? తగిన ప్రచార వ్యూహం లేయపోవడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రచార వ్యూహం లోపం

సొంత రాష్ట్రంలో బాక్సాఫీసుని శాసించే కోలీవుడ్ (తమిళ చిత్ర పరిశ్రమ) స్టార్స్ తమిళనాడు మార్కెట్ నుంచి  బయటకి అడుగుపెట్టినప్పుడు ఇప్పటికీ కష్టపడతారు.

ఇక్కడే ఇతర పాన్-ఇండియా చిత్రాలకు ప్రయోజనం లభిస్తుంది. తెలుగు సినిమాలకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు మార్కెట్లు ఉన్నాయి. దానితో పాటుఇతర రాష్ట్రాలలో మొత్తం స్టార్ కాస్ట్ తో జరిగే ప్రమోషన్లు అదనపు బోనస్ లాంటివి.

విషయానికి వస్తే, ‘RRR’ ప్రమోషన్‌లలో రామ్ చరణ్జూనియర్ ఎన్టీఆర్అలియా భట్, రాజమౌళి ప్రతి రాష్ట్ర రాజధానికి – చెన్నైకొచ్చిన్  ముంబై మొదలైన నగరాలకి వెళ్ళారు. ఇంకా నార్త్ లో కొన్ని పుణ్య క్షేత్రాలని కూడా సందర్శించి అక్కడా ప్రేక్షకుల్ని ఆకర్షించారు.

 ఈ జాతీయ స్థాయి ప్రచారం ఆర్ ఆర్ ఆర్  పట్ల భారీ ఆసక్తిని రేకెత్తించింది. అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‘ విషయంలో కూడా అదే జరిగిందిదీని  బృందం చెన్నైముంబైకొచ్చిన్,  హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రమోషన్లను చేపట్టింది.

  తమిళ చిత్రాలేవీ ఇతర రాష్ట్రాల్లో దూకుడుగా ప్రమోట్ చేయడం లేదు. గత ఒకటి  రెండేళ్లుగా చూస్తే ఉత్తరాదిన తమిళ సినిమాలేవీ పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. మాస్ ప్రేక్షకులకు చేరువ కావడానికి ప్రమోషన్‌లు మాత్రమే మార్గం. 

స్టార్స్ తో బాటు దర్శకులు పబ్లిక్ లోకి వెళ్ళడం చాలా ముఖ్యం.

 బాహుబలి‘ లేదా పుష్పని చూస్తేఉత్తర భారతదేశంలో వీటికి భారీ ప్రమోషన్లు జరిగాయి. అలాగేఇప్పుడు ‘RRR’ కోసంముంబై, ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని 13 ప్రధాన నగరాల్లో ప్రమోషన్లు జరిగాయి.

ఇక్కడ సినిమా ప్రమోషన్స్‌కి హాజరయ్యాడు కాబట్టి ఈరోజు నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ ఎవరో తెలుసు. రాజమౌళికి పెద్ద పేరు ఉందికాబట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయి.

ఉత్తర భారతదేశంలో తెలుగు చిత్రాలకు అదనపు ఆకర్షణ  అయిన అలియా భట్,  అజయ్ దేవగణ్ లు ప్రచార కార్యక్రమంలో ప్లస్ అయ్యారు.

ఈ నేపథ్యంలో తేలే దేమిటంటే, తమిళ స్టార్లు, దర్శకులు, నిర్మాతలు తెలుగు ప్రచార వ్యూహాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలోకి వెళ్లకపోతే పాన్ ఇండియా తమిళ చిత్రాలు తీసి లాభం వుండదు.

తమిళనాడులో మాత్రమే సందడి చేసి ఇతర రాష్ట్రాల్లో చడీచప్పుడు లేకుండా విడుదల చేస్తే వలిమై‘, ఈటీ లాంటి మరిన్ని పరాభవాలు ఇకముందు కూడా తప్పవు.

***