తమన్నా ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి.. తను ఎలాంటి డైట్ ఫాలో అవుతారో తెలుసా?

నటి తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్దంన్నర కాలం పూర్తయినప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. తమన్నా సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా తన ఫిట్నెస్ కోసం ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అనే విషయానికి వస్తే…

ఈమె తనికి ఇష్టమైన ఆహారం కనబడితే అదుపు చేసుకోకుండా ఉండలేరట.తనకి ఇష్టమైన ఆహారం కనపడితే మనస్ఫూర్తిగా భోజనం చేసి అనంతరం ఎక్కువ సేపు వ్యాయామం చేస్తానని చెప్పుకొచ్చారు. తమన్నా ఎక్కువగా ఇంటి నుంచి తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడతారట. ఇక తమన్నా ప్రతి మూడు గంటలకు ఒకసారి పోషక విలువలు కలిగిన ఏదో ఒక ఆహార పదార్థాలను తీసుకుంటారట.

ప్రతిరోజు అల్పాహారంగా ముయెస్లీ ఒక గిన్నె తీసుకుంటానని వెల్లడించారు.ఇందులో గ్రానోలా, ఖర్జూరం, బాదం పాలు, గింజలు, బెర్రీలు మరియు అరటిపండ్లు ఉంటాయి. అలాగే ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ తప్పనిసరిగా తీసుకుంటారట. మధ్యాహ్న భోజనంలో పప్పు, బ్రౌన్ రైస్ మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారు. సాయంత్రం ఏదైనా ఉడకబెట్టిన గింజలు రాత్రికి గుడ్లు, ఇడ్లీ లేదా దోసె. ఇక ప్రతిసారీ భోజనం చేసిన సమయంలో పెరుగు తప్పనిసరిగా ఉండాలని తమన్నా తెలిపారు. ఈ విధమైనటువంటి ఫుడ్ డైట్ ఫాలో అవుతూ వ్యాయామాలు చేస్తానని తెలిపారు. అదే తన ఫిట్నెస్ సీక్రెట్ అంటూ ఈమె చెప్పుకొచ్చారు.