బండ్లు ఓడలు అవుతాయి. ఓడలు బండ్లు అవుతాయనే సామెత పెద్దలు ఊరికే చెప్పలేదు. కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. దాదాపు ఏడుసార్లు ఎమ్మెల్యే గెలిచిన నేత, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, పైగా రాజుల కుటుంబానికి చెందిన రాజుగారు, ఆయన విజయనగరం జిల్లాలో ఎంత చెపితే అంతే, అలాంటి అశోక్ రాజపతి రాజు నేడు తన జీవితంలోనే గడ్డు రోజులను అనుభవిస్తున్నాడు. సరిగ్గా ఏడాది క్రితం చక్రం తిప్పిన చోటే, నేడు అన్ని రకాల అధికారాలు కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు.
2019 ఎన్నికల్లో ఓడిపోవటంతో ఆయన పతనం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఎవరు ఊహించలేని ఎదురుదెబ్బ ఆయనకు తలిగింది. ఆ ట్రస్ట్ కి అధ్యక్షుడిగా ఉంటున్న అశోక్ గజపతి రాజు తన తర్వాత ఆ బాధ్యతలు తన కూతురికి అప్పగించాలని భావించాడు, అయితే ఉరుములేని పిడుగు మాదిరి ఆయన అన్న కూతురు సంచయిత వచ్చి వాటిని ఎగరేసుకొనిపోయింది. ఆమెకు అధికార పార్టీ అండదండలు కూడా ఉండటంతో అశోక్ రాజపతి రాజు ఏమి చేయలేకపోయాడు. ఆ ఒక్క సంఘటనతో విజయ నగరంలో ఆయన ప్రభ తగ్గిపోయింది. దానికి తోడు చేతిలో ఎలాంటి అధికారం కూడా లేకపోవటం ఆయన పక్కన వుండే మంది మగ్బలం మెల్లగా పక్కకు తప్పుకుంది. ఎంతైనా రాజు గారి కుటుంబానికి చెందిన మనిషి కావటంతో సాధారణంగానే గౌరవ మర్యాదలు కోరుకుంటారు, ఇప్పుడు అలాంటివేమీ ఆయనకు దక్కటం లేదు.
ఇటు పార్టీ తరుపున చూసుకుంటే ఎలాంటి మద్దతు కూడా లభించటం లేదు, అసలు పార్టీ మనుగడే ప్రశ్నర్డకం అవుతున్న సమయంలో పార్టీ నుండి మద్దతు ఆశించటానికి ఏమి లేదని ఆయనకు అర్ధం అయ్యింది. ఇదే సమయంలో విజయనగరం పార్లమెంట్ అధ్యక్ష పదవి అశోక్ గజపతి రాజు కూతురికి కాకుండా చీపురుపల్లి కి చెందిన కిమిడి నాగార్జున కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పగించటంతో అశోక్ గజపతి రాజు వర్గం తీవ్ర అసంతృప్తితో వున్నారు, ఈ సంఘటనతో పార్టీ పరంగా కూడా విజయనగరంలో అశోక్ గజపతి శకం ముగిసినట్లే అనే మాటలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. మరి ఈ గడ్డు పరిస్థితి నుండి అశోక్ గజపతి రాజు ఎలా గట్టెక్కుతాడో చూడాలి..