పయ్యావుల కేశవ్ టీడీపీలో బలమైన నాయకుడు. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైస్ ఆర్ వేవ్ ని సైతం తట్టుకుని 2004, 2009 ఎన్నికల్లో కూడా గెలిచారు. 2019 లో జగన్ మోహన్ రెడ్డి స్పీడ్ని తట్టుకుని గెలిచారు పయ్యావుల. అదీ పయ్యావుల పొలిటికల్ సత్తా. అధికార పక్షంపై విరుచుకు పడటంలోనూ పయ్యావులది అందవేసిన చేయి. ఆయనలో ఈ ప్రతిభ గుర్తించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బాగా సన్నిహితుడిగా మారారు. కానీ అదే పయ్యావుల ఇప్పుడు మౌనం వహిస్తున్నారు? కొన్ని నెలలుగా పయ్యావుల గళం ఎక్కడా వినిపించలేదు.
ఈ నేపథ్యంలో ఆయన గురించి ఆసక్తికర ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. టీడీపీ పార్టీ చిన్న చూపు చూడటంతోనే పయ్యావుల కేశవ్ పార్టీకి దూరంగా ఉంటున్నట్లు వెలుగులోకి వస్తోంది. పార్టీ తనకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకునే పయ్యావుల ఇప్పుడు వాస్తవాలు గ్రహిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఏంటి ఆ వాస్తవాలు? అంటే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. 1999లో ఓడిపోయిన తర్వాత పదవిపై ఆశపడ్డారు. కానీ అప్పుడు జరగలేదు. టీడీపీ గెలిచిన పయ్యావుల ఖాళీగానే ఉన్నారు.
ఇక 2014 లో పయ్యావుల ఓడిపోయినా! టీడీపీ అధికారంలో లోకి వచ్చినా ఎమ్మెల్సీ దక్కింది గానీ మంత్రి పదవి దక్కలేదు. ఇలా కొన్నాళ్లగా పయ్యావుల కేశవ్ మంత్రి ఆశలన్నీ అడియాశలగానే మిగిలిపోయాయి. ఈ ఆశలు ఆయనలో తీవ్ర అసంతృప్తికి గురయ్యేలా చేసాయన్నది కొందరి వాదన. మొదటి నుంచి టీడీపీ పయ్యావులను చిన్న చూపు చూస్తుందని..కానీ ఆయనే గ్రహించడంలో విఫలమయ్యారని వాదనలు వినిపిస్తున్నాయి. సొంత కోటలో పయ్యావుల గురించి ఇటీవలే డిస్కషన్ వచ్చిందిట. ఆ సమయంలో పయ్యావుల మౌనం వెనుక అసలు కారణం ఏంటో కనుక్కోవాలని చంద్రబాబు నాయుడికి పలువురు సీనియర్ నేతలు సూచించినట్లు సమాచారం.