KCR: ఎవ్వరూ అధైర్యపడొద్దు. మళ్లీ అధికారం మనదే…. పార్టీ నేతలతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు!

KCR: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయ్యారు. అయితే ఈయన ఫామ్ హౌస్ కి పరిమితం అయినప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థయిలో ఫోకస్ పెడుతూ ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థితిగతులను గమనిస్తూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేసీఆర్ సైతం తిరిగే రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు.

ఇన్నిరోజులు పాటు ఫామ్ హౌస్ లోనే ఉన్న కేసిఆర్ తెలంగాణ భవన్ లోకి అడుగు పెట్టగానే పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో ఈయన కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులకు కొన్ని దిశా నిర్దేశాలను సూచించారని తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలను ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోయారని ఇప్పటికే తెలంగాణలో ఎందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాము అని ప్రజలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ఇదే అధునుగా భావించి మన పార్టీ నాయకులందరూ కూడా ప్రజలలోనే ఉండాలని మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను అందరికీ తెలియ చేయాలని కెసిఆర్ తెలిపారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే ప్రస్తుతం ఓడిపోయామని ఎవరు కూడా అధైర్య పడవద్దు ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా అని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని వెల్లడించారు.

పక్క ప్రణాళికలతోనే ప్రజలలోకి వెళ్లి ప్రజలందరికీ కూడా ప్రస్తుత ప్రభుత్వ తీరు గురించి వివరించాలని తెలిపారు. ఇక వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే పార్టీ కోసం కష్టపడిన వారందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.