సాధారణంగా ప్రకృతిలో పెరిగే అనేక రకాల మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. పూర్వకాలంలో ఇలా ప్రకృతిలో పెరిగే మొక్కలను ఉపయోగించి ఎన్నో వ్యాధులను నయం చేసేవారు. ప్రస్తుత కాలంలో కూడా మనం ఎందుకు పనికి రావని అనుకునే పిచ్చి మొక్కలను కూడా మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఇలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో నందివర్ధనం మొక్క కూడా ఒకటి. చాలామంది ఈ మొక్కలను ఇంట్లో పెంచుతుంటారు. నందివర్ధనం పూలను ఎక్కువగా పూజలు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ నందివర్ధనం పూలలో ఉండే ఔషధ గుణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తొలగిస్తాయి. నందివర్ధనం పూలు ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ముఖ్యంగా కంటి సమస్యలను నివారించడంలో ఈ నందివర్ధనం పూలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుత కాలంలో అందరూ ఫోన్ ,లాప్టాప్ లతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. అందువల్ల కంటి అలసట ఏర్పడుతుంది. అటువంటి సమయంలో ఈ నందివర్ధనం పూలను నీళ్లలో ముంచి పావుగంటసేపు కళ్ళ మీద ఉంచటం వల్ల కంటి అలసట తగ్గి కళ్ళు ఎర్రబడటం,కంటినొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఈ పువ్వులను నాలుగు గంటలసేపు నీటిలో ఉంచి ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా కంటి అలసట తగ్గుతుంది.
ఈ పువ్వుల నుండి వచ్చే పాలు గాయాలకు మందుగా ఎంతో ఉపయోగపడతాయి. గాయం అయిన ప్రదేశంలో ఈ పాలను రాయటం వల్ల తొందరగా గాయం తగ్గిపోతుంది. నందివర్ధనం ఆకులతో కషాయం తయారు చేసుకుని తాగటం వల్ల అధిక రక్తపోటు సమస్య కూడా నివారణలో ఉంటుంది. ముఖ్యంగా మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఈ పూలు ఎంతో ఉపయోగపడతాయి. ఇక ఈ నందివర్ధనం మొక్క వేర్లలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. నందివర్ధనం చెట్టు ఆకులు, పువ్వులు వేర్లను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. పంటి నొప్పి సమస్యతో బాధపడేవారు నందివర్ధనం చెట్టు వేర్లు నమల్లడం వల్ల పంటి నొప్పి సమస్య దూరం అవుతుంది.