యూపీలో విచిత్రం.. విద్యా మంత్రి యోగేంద్రకు అనుమతి ఇవ్వని కాలేజ్!

తాజాగా యూపీలోని ఆగ్రాలో ఉన్న ఓ కాలేజీలో శనివారం పెయింట్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొనేందుకు మంత్రి యోగేంద్ర విచ్చేశారు. అయితే ఈ కాలేజీలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయకు ఓ చేదు అనుభవం ఎదురైంది. గేటు దగ్గర 15 నిమిషాలు వేచి చూసిన ఆయనను లోపలకు అనుమతించకుండా అవమాన భారానికి గురి చేశారు.

ఎంతకూ గేటు తెరవకపోవడంతో ఆయన అసహనంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఉన్నత విద్యా మంత్రి వచ్చిన గేట్ తెరవకపోవడం యూపీ లో విచిత్రం చోటు చేసుకుంది. దీనిపై స్పందిస్తూ కళాశాల ప్రిన్సిపల్ అనురాగ్ శుక్లా.. డ్రాయింగ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఓ ఫ్యాకల్టీ ఎన్జీవో సహకారంతో ప్రైవేట్ గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కళాశాలలో ఇంటర్నల్ పరీక్షలు కూడా ఉన్నాయి అంటూ అందుకే తీవ్రమైన వాహనాల రద్దీ వివరించారు.

దీనివల్ల మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయులకు అనుమతించలేదు అన్న దురదృష్టకర ఘటన జరిగినట్టు తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వహించిన టీచర్ల నుంచి వివరణ కోరినట్టు చెప్పారు. తమ కాలేజీ లోపాలపై అధ్యయనానికి కమిటీని నియమించినట్లు తెలిపారు. అయితే మంత్రికి జరిగిన అసౌకర్యానికి విచారిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఇలాంటి ఘటన మరోసారి జరగదని ఆయన వెల్లడించారు.