AP: చొక్కా పట్టుకుని నిలబెడతాము…. వైసీపీ ప్రతిపక్ష హోదాపై బొత్స సత్యనారాయణ కామెంట్స్!

AP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2025-26 బడ్జెట్ సమావేశాలు కావడంతో నేడు ప్రారంభమైన ఈ సమావేశాలలో భాగంగా గవర్నర్ ముందుగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి వైసీపీ నేతలు కూడా హాజరు అయ్యారు అయితే ఈ సభ ప్రారంభమైన పది నిమిషాలకే వారు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇక వైసిపికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి దీంట్లో ప్రతిపక్షం హోదా కూడా కోల్పోయింది అయితే తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తాము అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. జగన్ కు విపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని తెలిపారు. ఒకటి అధికార పక్షం, రెండోది ప్రతిపక్షమని బొత్స తెలిపారు. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుందన్నారు. ప్రజల గొంతుక వినబడాలంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని తెలిపారు. ప్రజలు రైతులకు కష్టాలు తెలియాలి అంటే తమకు ప్రతిపక్షం ఉండాలని ఈయన తెలిపారు.

ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వం స్పందన బట్టి తమ స్పందన ఉంటుందన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాత్రం జనంలోకి వెళ్తామని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలబెడతామన్నారు. మిర్చి రైతుల సమస్యల గురించి జగన్ స్పందించిన తర్వాతే ప్రభుత్వం స్పందించి కేంద్రానికి లేఖ రాసింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సత్యనారాయణ మీడియా ముందు గుర్తు చేశారు.