రాపాక vs పవన్ కల్యాణ్ వీరాభిమానులు ఎపిసోడ్ లో సరికొత్త సంచలనం!

featured

2019 ఎన్నికల్లో టీడీపీతో పాటు కొత్తగా ఆవిర్భవించిన జనసేన పార్టీ కూడా ఓటమిని చవిచూసింది. కనీసం పార్టీ అధినేత కూడా గెలవలేకపోయారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన నుండి ఒకే ఒక్క నేత గెలిచాడు. అతనే రాపాక వరప్రసాద్. జనసేన నుండి గెలిచిన ఈనేత మొదట జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.అయితే కొన్ని రోజుల తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజా వరప్రసాద్ మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీ నుండి టికెట్ రాకపోవడం వల్లే తాను జనసేన నుండి పోటీ చేశానని, ఇప్పడు తాను వైసీపీ నేతగానే కొనసాగుతున్నానని తెలిపారు. అలాగే జనసేన గాలికి వచ్చిన పార్టని, అది ఎక్కకువ కాలం నిలబడే పార్టీ కాదని, తన గెలుపుకు తన బలము కారణమని, జనసేన వల్ల తనకు ఒరిగిందేమి లేదని వ్యాఖ్యానించారు.

అయితే రాపాక చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల వల్లే రాపాక గెలిచాడని, గెలిచిన తరువాత గాలి పార్టీ అని వ్యాఖ్యానించడం తగదని హెచ్చరించారు. రాపాకకు నిజంగా తన బలం మీద నమ్మకం ఉంటే పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. అయితే రాపాకకు ఉప ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం లేదని, ఆయన గెలుపుకు జనసేనే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాపాక తీసుకుంటున్న నిర్ణయాలకు, పార్టీకి సంబంధం లేదని గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మోసాలకు, అధికారం కోసం పాకులాడే వారికి తమ పార్టీలో స్థానం లేదని జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. కరోనా సమయంలో కూడా రాపాక, జనసేన నాయకుల మధ్య గొడవ ఈసారి తీవ్ర స్థాయికి చేరేలా ఉంది. రాపాక వ్యాఖ్యలు మీద జనసేన అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.