ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల వారీగా ఎప్పుడయితే తమ పార్టీ అధ్యక్షులను చంద్రబాబు నాయుడు నియమించాడో కానీ, అప్పటి నుండి ప్రతి చోట విభేదాలు బయటపడుతూనే వున్నాయి. చాలా చోట్ల స్థానికంగా పనిచేసే నేతలను కాకుండా పక్క నియోజకవర్గాల్లో ఉంటే నేతలను ఇంచార్జిలుగా నియమించటం, గతంలో వాళ్ళకి, వీళ్ళకి విభేదాలు ఉండటంతో ఇప్పుడు అవన్నీ బయటపడి రచ్చ కెక్కుతున్నాయి. మచిలీపట్టణం పార్లమెంట్ స్థానానికి కొనకళ్ల నారాయణను నియమించాడు బాబు. పెదనతో సహా మొత్తం ఏడూ నియోజకవర్గాలు మచిలీపట్టణం పరిధిలోకి వస్తాయి.
మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యత నారాయణదే. దీనితో అక్కడి నియోజకవర్గ నేతలు నారాయణ ను కలవటం జరిగింది. ఒక్క పెడన నియోజకవర్గం నుండి తప్ప. దానికి కారణం మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అని అంటున్నారు అక్కడి స్థానిక నేతలు. కొనకళ్ల కు, వెంకట్రారావు మధ్య వున్నా విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తుంది. మచిలీపట్టణం పరిధిలో ఎదో ఒక నియోజకవర్గంలో తన కొడుకును బరిలో దించి రాజకీయంగా అతన్ని బలోపేతం చేయాలనీ నారాయణ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. అందుకు పెడన సరైన స్థానమని భావించాడు, అయితే ఇందులో మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకటరావు కొడుకు కృష్ణ ప్రసాద్ గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ మీద పోటీచేసి, దాదాపు 54 వేలు ఓట్లు సాధించాడు కానీ జోగి రమేష్ చేతిలో ఓటమి మాత్రం తప్పలేదు. దీనితో పెడనలో కాగిత ఫ్యామిలీ హవా తగ్గింది కనుక తమకు అవకాశం ఇవ్వాలని కొనకళ్ల కోరిన కానీ చంద్రబాబు పెద్దగా స్పందించలేదు.
కొనకళ్ల మాత్రం పెడనలో పట్టు పెంచుకోవటం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో మచిలీపట్టణం ఇంచార్జి పదవి కొనకళ్లకు రావటంతో కాగిత ఫ్యామిలీలో అలజడి మొదలైంది. కొనకళ్లతో తమకు ఇబ్బందులు తప్పవని భావించిన కాగిత కృష్ణ ప్రసాద్ తన వర్గంతో కలిసి కొనకళ్లకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నాడు. అయితే ఇదే సమయంలో కొనకళ్ల తన ఆలోచనను మార్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. తన కొడుకు కోసమని పెడనలో రాజకీయం చేస్తే, అది తనకే ఇబ్బంది అవుతుందని, అదే సమయంలో గుడివాడ, గన్నవరం లాంటి కీలకమైన నియోజకవర్గాలను పట్టించుకోకుండా పెడన ను పట్టించుకుంటే అది మొదటికే మోసం వస్తుందని ఆలోచించిన కొనకళ్ల నారాయణ కొద్దీ రోజులు పాటు పెడన వైపు చూడకపోవటమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఏమి చేయలేని స్థితిలో ఉండటం కూడా కొనకళ్లకు కొంచం ఇబ్బంది కలిగిస్తుందని కూడా స్థానిక నేతలు చెపుతున్నారు, కొడుకు కోసం చూసుకుంటే అటు పెడనలో రాజకీయ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకోవటం ఖాయం. అధిష్టానం అనుగ్రహం లేకుండా పెడనలో కాగిత ఫ్యామిలీ హవాను తట్టుకోవటం కూడా కష్టమే అని భావించి కొనకళ్ల ప్రస్తుతం సైలెంట్ అయినట్లు తెలుస్తుంది.