‘వాంటెడ్ పండుగాడ్’లో సుడిగాలి సుధీర్‌.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల‌

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఇందులో సుడిగాలి సుధీర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురువారం చిత్ర యూనిట్ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ”సుడిగాలి సుధీర్ బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు. రీసెంట్ టైమ్‌లో సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు సుధీర్‌. ఆయ‌న వాంటెడ్ పండుగాడ్ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న’వాంటెడ్ పండుగాడ్’లో సుధీర్ న‌ట‌న అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ చిత్రానికి  ప్ర‌ముఖ ర‌చ‌యిత జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. త‌ర్వాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. మూడు, నాలుగు రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం” అన్నారు. ఈ చిత్రానికి మ‌హి రెడ్డి పండుగుల సినిమాటోగ్ర‌ఫీ.. పి.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నటీనటులు: సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు, అనంత్, పుష్ప జ‌గ‌దీష్‌, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ‌, హేమ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆమ‌ని, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌దిత‌రులు