TET Exam: చాలా వరకు విద్యార్థులు టెట్ పరీక్షలు రాయడానికి బాగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈ పరీక్షలు నిర్వహించే సమయం చాలా వరకు చాలా సమయం పడుతుంది. కానీ ఈ ఏడాది వీలైనంత త్వరగా టెట్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. తాజాగా ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.
మే నెలలో ఈ పరీక్షలు ఉండవచ్చని తెలుస్తుంది. ఒకసారి టెట్ లో అర్హత సాధిస్తే అది ఒక్కదానికి ఇప్పటివరకు ఏళ్ల కాలపరిమితి ఉండేది. కానీ ఆ తర్వాత దానికి అంత విలువ ఉండక పోయేసరికి మళ్లీ ఈ పరీక్షలు రాయాల్సిందే. కానీ ఈ సారి అలా కాకుండా ఒకసారి అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పులు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.