Janasena :జేడీ లక్ష్మీనారాయణ.. సిబిఐ జేడీగా పనిచేసిన అధికారిగా పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ రోజుల్లో భారీ పేరు సంపాదించారు. అయితే ఈయనకు పదవి కాలం చాలా ఉన్నప్పటికీ ఈయన ఊహించిన విధంగా తన పదవికి రాజీనామా చేశారు ఇలా సిబిఐ ఆఫీసర్గా రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి చేరారు. ఈ పార్టీలోకి చేరిన కొద్ది రోజులకే ఈయన తిరిగి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇలా లక్ష్మీనారాయణ ఎందుకు పార్టీలో చేరారు ఎందుకు బయటకు వచ్చారు అనే విషయంపై ఇప్పటికీ జన సైనికులలో ఎన్నో సందేహాలు ఉన్నాయి.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జెడి లక్ష్మీనారాయణకు ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా ఆయన ఎందుకు జనసేన పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది అనే విషయాలను వెల్లడించారు. తాను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తనకు చాలా పదవి కాలం ఉన్న ఆ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాను అని తెలిపారు అయితే పవన్ కళ్యాణ్ కూడా సినిమాలలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రజాసేవ కోసం జనసేన పార్టీని స్థాపించారని తెలిపారు ఇలా మా ఇద్దరి ఆలోచనలు ఒక్కటి కావడంతోనే తాను పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరానని లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇక 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత ఈయన రాజకీయాలలోనే కొనసాగుతూ ప్రజాక్షేమం కోసం పోరాడి ఉంటే తాను కూడా పార్టీ నుంచి బయటికి వచ్చేవాన్ని కాదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తిరిగి సినిమాలలోకి రావడం నాకు నచ్చలేదు అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. రాజకీయాలలో పూర్తిగా ఉంటేనే ఎవరికైనా సీరియస్ నెస్ వస్తుందని అది తన భావనగా తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళ్ళటం వల్ల తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జై భారత్ పార్టీని కూడా స్థాపించి అందుకు తగ్గట్టుగా పోరాటం చేశానని తెలిపారు.
