షాకింగ్ : రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన శశికళ .. !

sashikala re entry in madras politics

జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ షాకింగ్ ప్రకటన చేశారు. అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో దోషిగా జైలు శిక్షను పూర్తి చేసుకుని, జనవరిలో విడుదైలన వీకే శశికళ తనను బహిష్కరించిన అన్నాడీఎంకే పార్టీపై తిరిగి పట్టు సాధించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు రావడం, మొన్న జయలలిత జయంతి నాడు కూడా తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఆమె ఇంటికి క్యూకట్టడం, దాంతో శశికళ మళ్లీ జూలు విదిలించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ వాటన్నింటికీ రివర్సులో శశికళ ఏకంగా రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి తప్పుకున్నారు. పొలిటికల్, పబ్లిక్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. .

 ఏనాడూ పవర్‌లో లేను..

‘జయ(దివంగత తమిళనాడు సీఎం జయలలిత) అధికారంలో ఉన్నప్పుడుగానీ, పదవిలో లేనప్పుడుగానీ నేను ఏనాడూ అధికారం, పదవి కోసం అర్రులు చాచలేదు. జయ మరణం తర్వాత కూడా ఆ రెండిటినీ(పదవి, అధికారం) నేను కోరుకోలేదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. అయితే, జయ స్థాపించిన పార్టీ(ఏఐఏడీఎంకే) గెలవాలని ప్రార్థిస్తున్నాను. ఆమె వారసత్వం కలకాలం కొనసాగుతుంది” అని వీడ్కోలు లేఖలో శశికళ పేర్కొన్నారు.

జయ మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ లో తాను భర్తీ అయ్యేందకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేయడం, సామదానబేధదండోపాయాలతో శaiశికళను జైలుకు పంపేసి, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలను మచ్చిక చేసుకోవడం, దెబ్బకు అన్నాడీఎంకేను ఎన్డీఏ భాగస్వామిగా మలుచుకోవడం చకాచకా జరిగిపోయాయి. కాగా, ఈ ఏడాది జనవరిలో శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత పొలిటికల్ సీన్ అటు ఇటు అయినట్లు కనిపించడం, అన్నాడీఎంకేపై శశికళ తిరిగి పట్టు బిగిస్తే బీజేపీతో కలిసి మనగలరా? అని, ఒక వేళ శశికళ తోకజాడిస్తే మళ్లీ జైలుకు పంపేందుకూ బీజేపీ వెనుకాడబోదనే వాదనలను విస్తృతంగా వినిపించాయి. చివరికి రాజకీయాల నుంచి, ప్రజాజీవితం నుంచి పూర్తిగా తప్పుకోవడం ద్వారా సైలెంట్ అయిపోవాలనే శశికళ నిర్ణయించుకోవడం డీల్ లో భాగంగా జరిగిందేనా? అనే కామెంట్లు వస్తున్నాయి