వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే సిట్ విచారణలో భాగంగా వెలుగు చూసిన అంశాల పై లోతుగా అధ్యయనం చేస్తున్న సీబీఐ, వివేకానందరెడ్డి కుమార్తె లేవనెత్తిన పలు అంశాల పై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అనుమానితుల జాబితా సిద్ధం చేసుకున్న సీబీఐ, పలువురికి ముందస్తు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో వివేకా కేసులో అనుమానితులను, ఒక్కొక్కరిని విచారిస్తున్నంది.
ఇక బుదవారం వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన దేవిరెడ్డి శంకర్ సీబీఐ ముందు హాజరు అయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడు అయిన దేవిరెడ్డి శంకర్..సీబీఐ విచారణంలో కొన్ని కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. వివేకా హత్య వెనుకు ఓ ప్రముఖ నేత హస్తం ఉందనే అనుమానం సీబీఐ ముందు వ్యక్తపర్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు కొన్ని కీలక ఆధారాలు కూడా సీబీఐకి సమర్పించనట్లు సమాచారం.
అయితే ఆ కీలక నాయకుడు పేరు మాత్రం బయటకు రాలేదు కానీ, వివేకా హత్య జరిగినప్పడు అధికారంలో ఉన్న పార్టీకి చెందని నాయకుడు అని టాక్. దీంతో దేవిరెడ్డి శంకర్ ఇచ్చిన ఆధారాలతో ఆ ప్రముఖ నేతని అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన వివేకా హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన హత్యకు సంబంధింకి విచారణలో భాగంగా కీలక నేత అరెస్టుకు సంబందించి వార్తలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి.