ప్రస్తుత సమాజంలో నిత్యం ఏదో ఒక ప్రదేశంలో వివాహేతర సంబంధాల విషయాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం వారి ప్రవర్తనను మార్చుకోవడం లేదు. ఇప్పటికే ఈ వివాహేతర సంబంధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా పోయాయి. అయినప్పటికీ ఇలాంటి తప్పుడు పని చేసే వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, పెళ్లి భార్య పిల్లలు, మంచి కుటుంబం కలిగిన ఒక వ్యక్తి కట్టుకున్న భార్యను మోసం చేస్తూ ప్రియురాలి మోజులో పడి కుటుంబంతో పాటు తన భార్యను కూడా నిర్లక్ష్యం చేశారు. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ భార్య ఒకరోజు అతడినీ ఫాలో అయి ప్రియురాలితో రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారికి దేహశుద్ధి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా సాలూరు పట్టణం చిన్న హరిజన పేటలో నివాసం ఉండే సింగారపు తౌడు అనే వ్యక్తి విద్యా శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతనికి కొన్నేళ్ల క్రితం జయంతి అనే మహిళతో పెళ్లైంది. ఈ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి, అన్న విషయాన్ని మర్చిపోయి తౌడు గత కొంత కాలంగా ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఇక ప్రియురాలి మోజులో పడిన అతను తన భార్యని పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. భర్తని గమనించిన అతడి భార్య అతనిలో మార్పులు గమనించి అతను చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక పోయింది.
దీంతో జయంతి ఎలా అయినా తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని నిశ్చయించుకుంది. అప్పుడు తన బంధువుల సహాయంతో తన భర్త పై నిఘా ఉంచి ఎక్కడికి వెళుతున్నాడు ఏం చేస్తున్నాడు అని ఒక కంట కనిపెట్టి ఉంటుంది. అలా ఒకరోజు పాచిపెంట సమీపంలోని డంపింగ్ యార్డ్ లో తన ప్రియురాలితో సరసాలు ఆడుతున్నట్లు తెలుసుకున్న జయంతి ముందుగానే సాలూరు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి, పోలీసులను బంధువులను తన వెంట పెట్టుకొని మరి తౌడు, అతని ప్రియురాలు ఉన్న స్పాట్ కి వచ్చింది. వీళ్ళను చూసి జయంతి భర్త పారిపోయాడు. ఇక ప్రియురాలు మాత్రం దొరికిపోయింది. తనని చూడగానే కోపంతో ఉర్రూతలూగి పోయినా జయంతి ఆమెను పట్టుకొని దేహశుద్ధి చేసింది. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి మరి కొట్టింది. తన కాపురాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అంటూ చితకబాదింది. ఆ తరువాత భర్తనీ, అతడి ప్రియురాలిని సచివాలయం వద్దకు తీసుకెళ్లి పంచాయితీ పెట్టింది. స్థానిక పెద్దలు తౌడు కి నచ్చచెప్పి పంపించేశారు.పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.