దర్శకుడు పూరి జగన్నాథ్ వ్యక్తిత్వంను బయటపెట్టిన నటి సందీప్తి!

సందీప్తి తెలుగు చలనచిత్ర నటి. సహాయక పాత్రలలో, టీవీ సీరియల్ లలో నటించి, రాణిస్తుంది. ఈమె విజయనగరం జిల్లాలో జన్మించింది. కుటుంబమంతా హైదరాబాదులో స్థిరపడింది. ఈమె క్లాసికల్ డాన్స్, భరతనాట్యంలో డిప్లమా చేసింది. తన కెరీర్ లో క్లాసికల్ డాన్సర్ గా స్థిరపడాలనేది తన కోరిక.

స్వర్గీయ దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన యంగ్ ఇండియా సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని పేపర్ ప్రకటన ద్వారా చూసి తాను కూడా ఆడిషన్స్ కు వెళ్లడం జరిగింది. దాదాపుగా రెండు వేలకు పైగా అప్లికేషన్స్ వస్తే, రెండు మూడు రౌండ్ల ఇంటర్వ్యూలో తాను మొదటి రౌండ్ లోనే సెలెక్ట్ అయ్యానని, ఆ సినిమా అంతా రామోజీ ఫిలిం సిటీ లోనే నిర్మించడం జరిగింది.

ఈ సినిమా ద్వారా వచ్చిన చెక్కును జిరాక్స్ చేసుకొని భద్రంగా దాచుకున్నానని గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొంది. ఆ తర్వాత జీ తెలుగులో కళ్యాణం లో మొదటిసారి నటించినట్లు పేర్కొంది. ఇలా తన కెరీర్లు ప్రారంభించి ఒక వైపు సినిమాలలో, మరొకవైపు సీరియల్లలో నటించడం జరిగింది.

ఇక ఇంటర్వ్యూలో భాగంగా సినీ ఇండస్ట్రీ గురించి ఏదైనా మనం చూసే దాన్నిబట్టి, ఊహించుకునే దాని బట్టి పరిణామాలు ఉంటాయని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు లేకపోతే లేదు. నా ఉద్దేశంలో మంచివాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్లు కూడా ఉన్నారు అంటూ ఒకసారి పూరి జగన్నాథ్ సినిమాలో కేవలం రెండు గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొనడం జరిగింది.

నాలాగా సహాయ పాత్రలలో నటించే వారిని దర్శకులు ఎక్కువగా పట్టించుకొరు. మాలాంటి వాళ్లకు దర్శకులతో మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ కానీ ఆయన అడిగిన వెంటనే నాతో మాట్లాడి సెల్ఫీ కూడా దిగారు. ఒక సంవత్సరం తర్వాత ఏదో పాత్రలో నన్ను తీసుకోవాలని అడిషన్ కూడా చేయకుండా డేట్స్ పంపించేశారు.

తర్వాత షూటింగ్లో సందీప్తి ఎలా ఉన్నావమ్మా అని పలకరించారు. సంవత్సరం క్రితం కేవలం రెండు గంటల షూటింగ్లో నటించిన నన్ను గుర్తు పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా ఆప్యాయంగా పలకరించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇక పలు సినిమాలలో అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి అని పేర్కొంది.