AP: ఏపీ సర్కారుకు షాక్… రిషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ రద్దు… కూటమి వైఫల్యమే కారణమా?

AP: ఏపీ సర్కారుకు ఇది గట్టి షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీ పర్యాటక శాఖ పర్యాటకులను ఆకర్షించడంలో విఫలమవుతుందా అంటే అవుననే తెలుస్తుంది. మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్లే బీచ్ ఏదైనా ఉంది అంటే అది ఋషికొండ బీచ్ అనే చెప్పాలి గతంలో ఈ బీచ్కు బ్లూ ఫ్లాగ్ అనుమతి ఇచ్చారు కానీ తాజాగా బ్లూ ఫ్లాగ్ తొలగించినట్టు తెలుస్తోంది. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటి ఇది ఎందుకు ఇస్తారు అనే విషయానికి వస్తే…

మన రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడైనా పర్యాటక ప్రాంతాలను పర్యాటకులు ఆకర్షించాలి అంటే అక్కడ పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యంగా ఉండాలి అక్కడ పరిశుభ్రతను ఆధారంగా బ్లూ ఫ్లాగ్ కేటాయిస్తారు ఇలా బ్లూ ఫ్లాగ్ ఉంది అంటే ఆ పర్యాటక ప్రాంతం ఎంతో పరిశుభ్రంగా ఉందని అర్థం ఈ ఫ్లాగ్ ఆధారంగా విదేశీ పర్యటకులు కూడా ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు.

ఇక వైజాగ్ లో అతి పెద్ద బీచ్ అయినటువంటి ఋషికొండ బీచ్ కి 2020వ సంవత్సరంలో బ్లూ ఫ్లాగ్ అనుమతి ఇచ్చారు ఆ సమయంలో అక్కడ పరిసరాలు ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా పరిశుభ్రత కూడా మైంటైన్ చేస్తున్న నేపథ్యంలోనే బ్లూ ఫ్లాగ్ కేటాయించారు కానీ ప్రస్తుతం మాత్రం అక్కడ పరిశుభ్రతపై ప్రభుత్వం దృష్టి సారించలేదని తెలుస్తోంది.

బీచ్ తీర ప్రాంతం మొత్తం చెత్త పేరుకుపోవడమే కాకుండా సీసీ కెమెరాలు కూడా లేవు అలాగే అక్కడ వాష్రూమ్స్ కూడా శుభ్రత లేకపోవడం వల్ల ఋషికొండ బీచ్ కి ఇచ్చిన ఈ బ్లూ ఫ్లాగ్ రద్దు చేశారు. ఇలా బీచ్ ప్రాంతం పరిశుభ్రత లేదు అంటే అందుకు కారణం కూటమి ప్రభుత్వ వైఫల్యమైన అని స్పష్టం అవుతుంది. పర్యాటకశాఖ సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఋషికొండ బీచ్ కి ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని పర్యాటకులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.