యంగ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాకతో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సీన్ మారిన సంగతి తెలిసిందే. రాష్ర్టానికి మూడు రాజధానులు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ని ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ గా, జ్యుడిషయల్ క్యాపిటల్ గా కర్నూలు, అమరావతి యధావిధిగా రాజధానిగా కొనసాగిస్తూ పెను సంచనలానికే నాంది పలికారు. వాస్తవానికి అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పటినప్పుడు విశాఖ రాజధాని కావాల్సింది. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండటంతో తమ సామాజిక వర్గానికే అభివృద్ధి కాంక్షించి విజయవాడను అమరావతిగా పేరు మార్చి రాజధాని చేసారు.
కానీ జగన్ కొట్టిన దెబ్బకు బాబు తో ఆ సామాజిక వర్గానికి సౌండ్ లేదు. అమరావతే రాజధాని కావాలని అరిచి ఆర్తనాదాలు పెట్టినా జగన్ పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర , రాయలసీమ తో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా జగన్ సర్కార్ ముందుకు సాగిపోతుంది. ఇక తాత్కలికంగా రాజధానిని అడ్డుకున్నా రాజధానాలుగా విశాఖ, కర్నూలు ఖరారైపోయినట్లే. పరిపాలనా విభాగానికి సంబంధించి ఇప్పటికే అన్ని వసతులను విశాఖలో సమకూర్చుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పనుల స్పీడ్ తగ్గిందిగానీ, లేదంటే ఈపాటికే విశాఖ రాజధాని అయిపోయేదని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇటీవలే విశాఖలో పునరుద్ఘాటించారు.
తాజాగా నేడు జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టి విశాఖ ఎలా రూపం మార్చుకోబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్, బెంగుళూరు, ముంబై నగరాలకు ధీటుగా విశాఖ అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఆ సత్తా రాష్ర్టంలో ఆ ఒక్క నగరానికి మాత్రమే ఉందని స్పష్టం చేసారు. విశాఖని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయాలో అన్ని రకాలుగా అభివృద్ది చేస్తామన్నారు. ఇప్పటికే ఆ నగరం స్మార్ట్ సిటీ హోదాలో ఉంది కాబట్టి అభివృద్ది మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు. విశాఖ, కర్నూలు సహా రాష్ర్టంలో వివిధ జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని స్పష్టం చేసారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి విశాఖ భవిష్యత్ లో ఎలా రూపం మార్చుకోబోతుందో? ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే అభివృద్ది కి సంబంధించి పలువురు సీనియర్లతో జగన్ మంతనాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.