Vargin Boys: దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ వర్జిన్ బాయ్స్. రాజా ధారపునేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాజ్ గురు బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. జూలై 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రల్లో నటించారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఇది ఇలా ఉంటె సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో వర్జిన్ బాయ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ మాట్లాడుతూ ఈ సినిమా టికెట్ కొనుగోలు చేసిన 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారు.
మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో కొన్ని థియేటర్లలో డబ్బు మీపై వర్షంలో కురిసి ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపారు. ఇలా టికెట్ పట్టు ఐఫోన్ కొట్టు అనే అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించడంతో ప్రేక్షకులకు సైతం ఈ సినిమాను చూడడానికి టికెట్ కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మరి ఈ ఐఫోన్ అదృష్టం ఎవరిని వర్తిస్తుందో చూడాలి మరి. 11 మంది లక్కీ మెంబర్స్ ఎవరో కూడా చూడాలి మరి.