వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటు సినిమాల గురించి, అటు రాజకీయాల గురించి స్పందిస్తూ నిత్యం తన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచే రాంగోపాల్ వర్మ ఇటీవల మరొకసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ లో సినిమా టికెట్ రేట్లు ప్రభుత్వం తగ్గించిన సమయంలో సినిమా ఇండస్ట్రీ నుండి ఏపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా జగన్ ని వ్యతిరేకిస్తూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మద్దతు తెలిపారు.
కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ ఏపీలో సినిమా టికెట్ల విషయం గురించి స్పందించారు. జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు తగ్గించడంతో సినీ పెద్దలు చిరంజీవి అధ్వర్యంలో కొందరు స్టార్ హీరోలు కూడా జగన్ ని కలిసి చర్చించిన తర్వాత అటు ప్రేక్షకులు, ఇటు నిర్మాతలు ఇబ్బందులు పడకుండా కమిటీ సిఫారసు మేరకు ఏపీలో టికెట్స్ ధరలు పెరిగాయి. కానీ తెలంగాణాలో మాత్రం సినిమా టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాని మల్టీ ప్లెక్స్ థియేటర్ లో చూడాలంటే టికెట్ కి రూ. 500 వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రేక్షకులు ఓటీటీలో సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఈ విషయం గురించి స్పందిస్తూ.. అప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చిత్ర పరిశ్రమకు ఎంత మేలు చేస్తుందో తెలిసొచ్చింది. ఆయన పరిశ్రమను తొక్కాలని కాదు, పైకి తేవాలని చూశారని అర్థమైంది అంటూ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. అప్పుడు టికెట్స్ ధరల పెంపు కోసం పోరాడిన మేమంతా ఇప్పుడు జోకర్లు అయ్యాము. ప్రేక్షకుల స్తోమత గురించి సినిమా టికెట్ రేట్లు పెంచితే థియేటర్లో సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపరు. జగన్ తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్ అని ఇప్పుడు నిరూపణ అయ్యింది .అసలు నిజాలు తెలిశాక ఇప్పుడు మేము చేసిన తప్పు తెలిసొచ్చింది అంటూ జగన్ నిర్ణయాన్ని సమృదించాడు.