ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంటారు. వాళ్ల పెళ్లి కాకముందు నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక కారణంతో వాళ్లు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
పెళ్లి కాకముందు వాళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరగడం.. అప్పట్లోనే అనుష్క.. స్టేడియానికి వచ్చి.. క్రికెట్ ఆడుతుంటే విరాట్ కు ప్లయింగ్ కిస్సులు ఇవ్వడం.. వాళ్లిద్దరు కలిసి చేసినవెన్నో చూశాం. సైగల ద్వారానే వాళ్లు ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లు.
తర్వాత వాళ్లకు పెళ్లయిపోయింది. ఇప్పుడు అనుష్క గర్భవతి కూడా. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది కదా. కోహ్లీ… బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది.
ఇటీవల ఆర్సీబీ, సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్ కు అనుష్క కూడా వచ్చింది. స్టేడియంలో కూర్చున్నది. మ్యాచ్ జరుగుతుండగా.. విరాట్.. అనుష్క వైపు చూసి.. తిన్నావా? అని సైగ చేశాడు. వెంటనే అనుష్క కూడా తిన్నా.. అంటూ థంబ్ నెయిల్ చూపించింది. అలా కాసేపు వాళ్లిద్దరి మధ్య సైగలు కంటిన్యూ అయ్యాయి. దాన్ని కెమెరాలో బంధించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.