Sai Pallavi : సాయి పల్లవి క్రేజ్ చూసి షాకైన స్టార్ డైరెక్టర్ సుకుమార్..ఓ రేంజ్ కామెంట్ చేసాడుగా!

Sai Pallavi : ఒక్కోసారి మన స్టార్ హీరోలకి ధీటుగా కొంతమంది హీరోయిన్లు కి కూడా గట్టి క్రేజ్ దక్కుతుంది. అలాంటి స్టార్ హీరోయిన్లు కూడా కొంతమంది ఉన్నారు. మరి వారిలో మన సౌత్ నుంచి అనుష్క, నయనతార, సమంతా లాంటి హీరోయిన్లు ఒక స్టాండర్డ్ ని సెట్ చేసి పెట్టుకున్నారు. మరి వీరికి మన స్టార్ హీరోలకి ధీటుగా భారీ క్రేజ్ ఉండగా ఇప్పుడు ఈ లిస్ట్ లో లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ సాయి పల్లవి కూడా చేరింది అని చెప్పాలి.
తన సినిమాలు డాన్స్ లతో సాయి పల్లవి కి ఏ రేంజ్ క్రేజ్ ని సంపాదించుకుందో నిన్న ప్రూవ్ అయ్యింది. ఆమె ముఖ్య అతిధిగా హీరో శర్వానంద్ నటించిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు అయ్యింది. మరి ఈ వేడుకకి స్టార్ దర్శకుడు సుకుమార్ కూడా హాజరు అయ్యారు. మరి ఈ వేదికపై ఒక్కసారిగా సాయి పల్లవి క్రేజ్ చూసి తాను షాక్ అయ్యిపోయాడు.
ఆమె పేరుకి గాను శిల్పకళావేదిక ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. దీనితో సుకుమార్ సాయి పల్లవిని లేడీ పవన్ కళ్యాణ్ అంటూ ఓ రేంజ్ ఎలివేషన్ ఇవ్వగా ఈ వీడియో క్లిప్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక ఇదిలావుండగా రీసెంట్ గా సాయి పల్లవి నాచురల్ స్టార్ నానీ తో చేసిన శ్యామ్ సింగ రాయ్ తో భారీ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.