పిక్ వైరల్ : మహేష్ థియేటర్ లో “కార్తికేయ 2” చూసిన తమిళ బిగ్ స్టార్ హీరో..!

ఇప్పుడు ఒక్క సౌత్ ఇండియా లోనే కాదు ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా వినిపిస్తున్న సినిమా పేరు “కార్తికేయ 2”. మన తెలుగు యువ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కి అంతకంతకూ ఆదరణ భారీ స్థాయిలో పెరుగుతుండగా..

లేటెస్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఈ హిట్ సినిమాని హైదరాబాద్ లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్స్ ఏ ఎం బి సినిమాస్ లో ప్రముఖ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చూడడం ఆసక్తిగా మారింది. జెనరల్ గా విజయ్ షూటింగ్ మినహా బయట తిరుగేది చాలా తక్కువ అలాంటిది విజయ్ నిఖిల్ సినిమా కార్తికేయ2 అందులోని మహేష్ థియేటర్ లో చూడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

పైగా మహేష్ థియేటర్ లో ఉన్న విజువల్స్ పిక్ లు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఇదిలా ఉండగా విజయ్ అయితే మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి తోనే ‘వరిశు” తెలుగులో “వారసుడు” అనే భారీ సినిమా తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ షూటింగ్ లో విజయ్ హైదరాబాద్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.