Vijay: దళపతి విజయ్ ఆఖరి మూవీ జన నాయకుడు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. నెట్టింట పోస్ట్ వైరల్!

Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం విజయ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా హీరో విజయ్ దళపతి నటిస్తున్న ఆఖరి సినిమా జన నాయకుడు. కాగా నేడు అనగా జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు సందర్బంగా జన నాయకుడు మూవీ ఫ‌స్ట్ రోర్‌ గ్లింప్స్‌ ను విడుద‌ల చేశారు.

తాజాగా విడుదల చేసిన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి తోడు విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా కావడంతో అభిమానులు కూడా వీడ్కోలు పలకడానికి బీజం చేసిన‌ట్లు గ్లింప్స్ రెడీ చేసినట్లు అర్థ‌మ‌వుతుంది. ఇక 65 సెక‌న్ల వ్య‌వ‌ధి ఉన్న జ‌న నాయ‌కుడు ఫ‌స్ట్ రోర్ వీడియోను గ‌మ‌నిస్తే.. నా హృద‌యంలో ఉండే.. అనే మాట‌లు విజ‌య్ వాయిస్‌ లో మ‌న‌కు వినిపిస్తాయి. పోలీస్ డ్రెస్‌ లో లాఠీ ప‌ట్టుకుని యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే ప్ర‌దేశంలో న‌డుస్తూ వ‌స్తుంటారు. ఈ విజువ‌ల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్‌ గా ఉన్నాయి.

The First Roar - Jana Nayagan | Thalapathy Vijay | H Vinoth | Anirudh | Pooja Hegde | KVN

ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తోంది. కాగా పెద్ద సింహాస‌స‌నం మీద ద‌ళ‌ప‌తి విజ‌య్ ఠీవిగా కూర్చుని చేతిలో క‌త్తిని ప‌ట్టుకున్నాడు. ఇంటెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో కూర్చున్న విజ‌య్ చుట్టూ పొగ ఆవ‌రించబ‌డి ఉంది. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే ఓ రాజు, యోధుడు, నాయ‌కుడు క‌లిసిన వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తి మ‌న కథానాయ‌కుడ‌ని అర్థం చేసుకోవచ్చు. మరి విజయ్ నటిస్తున్న ఈ ఆఖరి సినిమా ఆయనకు ఏ మేరకు గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి మరి. ఈ లాస్ట్ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.