మరో కెజిఫ్ తో విక్రమ్

దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం విక్రమ్ అంటే ఒక సెన్సేషన్. తెలుగు, తమిళ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ‘అపరిచితుడు’ సినిమాతో అతని స్టార్డం ఎక్కడికో వెళ్ళిపోయింది. కమల్ హాసన్, రజినీకాంత్ ని మించిపోతాడు అని అందరు అనుకున్నారు, కానీ ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత విక్రమ్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి.

ఈ మధ్య మణిరత్నం ‘పొన్నాలసెల్వన్’ సినిమాలో ఒక కీ రోల్ లో నటించాడు విక్రమ్, ఆ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు తాజాగా పా రంజిత్ సినిమా కి సైన్ చేసాడు విక్రమ్. నిజ జీవితాలకు దగ్గరగా ఉండే సినిమాలు తీసే పా రంజీ ఈ సారి కెజిఫ్ బ్యాక్డ్రాప్ లో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా  పూర్తిగా నిజమైన కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కార్మికుల కథతో తెరకెక్కుతుంది. దీనిలో కూడా కొంత ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా పా రంజిత్ కథలు నిజజీవితానికి దగ్గరగా నేచురల్ ఎమోషన్స్, ఎలిమినెంట్స్ తోనే ఎక్కువగా ఉంటాయనేది నిజం. ఈ నేపధ్యంలోనే చియాన్ విక్రమ్ తోచేయబోయే సినిమా కథ కూడా నిజజీవిత సంఘటనలని స్ఫూర్తిగా తీసుకొని కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.