అంటే ఆ గూండాను జనం 3 సార్లు ఎమ్మెల్యేని ఎలా చేశారా విజయసాయిగారు ?

Vijaysai Reddy blames MLA Velagapudi Ramakrishnababu as rowdy 

రాజకీయ నాయకులకు సొంత సమీకరణాలు, సొంత లెక్కలు ఉంటాయి.  వాటిని వారు తప్ప ఎవ్వరూ అనుసరించలేరు.  అవి వారి ఒక్కరి విషయంలోనే  పనిచేస్తుంటాయి.  అలాగని అవే న్యాయాలను వేరొకరికి ఆపాదిస్తామంటే అస్సలు కుదరదు.  న్యాయం అనేది ఎవరు ఏ కోణంలో చూసినా ఒకేలా ఉంటుంది.  నిజంగా అది న్యాయమే అయితే కాస్త ముందు వెనుక అయినా అందరికీ ఒకే తరహా అనుభూతిని ఇస్తుంది.  కానీ రాజకీయంలో మాత్రం ఇవాళ న్యాయం అనిపించింది  రేపు అన్యాయమని, తమ విషయంలో ఒప్పు అయింది వేరొకరి  విషయంలో తప్పని అంటుంటారు.  వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిగారి వ్యవహారం చూస్తే ఇలాగే ఉంది.  మొన్నామధ్యన విశాఖలో రెవెన్యూ అధికారులు కొంత ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నారు.  అది టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు స్థలానికి ఆనుకుని ఉంది.  కాబట్టి ఆక్రమించింది ఆయనే అంటున్నారు వైసీపీ నేతలు. 

కానీ రామకృష్ణబాబు మాత్రం అది తనది కాదని, తనకు ఎలాంటి బినామీ ఆస్తులు   లేవని తనపై చేసిన ఆరోపణలు విజయసాయి‌రెడ్డి నిరూపించగలరా.. ఆరోపణలు నిజమైతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటాను.  నిరూపించకపోతే విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు.  మామూలుగానే విజయసాయిగారికి చమత్కారం ఎక్కువ.  జోలికి రాణి వారితో కూడ సున్నం పెట్టుకోవడం సరదా.  అలాంటిది వెలగపూడి సవాల్ స్=విసిరితే ఊరుకుంటారా.  చెలరేగిపోయారు.  విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణఅంటూ ప్రారంభించి  చంపేసిన వంగవీటి మీద అయినా ప్రమాణం చేయగలడు.  విశాఖ వచ్చిన వెలగపూడి ఏం చేశాడంటే.. భూములు మేశాడు.  పీకలు కోశాడు అని అనేక మంది చెబుతున్నారు.   విశాఖలో వెలగపూడిని ఎవరైనా ధర్మాత్ముడు అనుకుంటారా లేక ఒక గూండా, రౌడీ ఎలిమెంటుగా భావిస్తున్నారా.. ? అన్నారు.

Vijaysai Reddy blames MLA Velagapudi Ramakrishnababu as rowdy 
Vijaysai Reddy blames MLA Velagapudi Ramakrishnababu as rowdy 

నిజంగా విజయసాయిరెడ్డిగారు కణం కోణం నుండే రామకృష్ణబాబును రౌడీ, గూండా అని ఉంటే మాత్రం అది ప్రజా తీర్పును అవమానించినట్టే అవుతుంది.  ఎందుకంటే రామకృష్ణబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాదు.  తూర్పు నియోజకవర్గం నుండి వరుసగా 2009, 2014, 2019 మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.  అది కూడ 47 వేలు, 26 వేల భారీ మెజారిటీతో.  అంటే విశాఖ జనం ఈ మూడుసార్లు కూడ కళ్ళు మూసుకుని ఒక రౌడీని, గూండానే ఎమ్మెల్యేని చేశారని అనుకోవాలా.  విజయసాయిగారు చెబుతున్నట్టు నిజంగానే రామకృష్ణబాబు రౌడీ అయ్యుంటే వరుసగా ప్రత్యర్థులను చిత్తుగా ఓడించగలిగేవారా.   ఒకవేళ నిజంగానే విశాఖ తూర్పు ప్రజలు గత మూడు ఎన్నికలుగా పొరపాటు చేస్తూ వస్తుంటే  విజయసాయిగారు వీలైనంత త్వరగా ఆధారాలేవో చూపించేసి రామకృష్ణబాబును రౌడీ, గూండా అని నిరూపించేస్తే ఇకపై అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా పడతారు జనం.